మన్మధుడుతో ‘మిర్చి’ భామ

Prasad
‘మిర్చి’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో హంసానందిని నటించిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ఐటెం సాంగ్ లో నటిస్తుంది.  టాలీవుడ్ మన్మధుడుగా అభిమానులు పిల్చుకునే నాగార్జున్ నటిస్తున్న ‘భాయ్’ సినిమాలో హంసానందిని ఒక ఐటెం సాంగ్ లో నటిస్తుంది. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న భాయ్ సినిమాలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, ఈ సందర్భంగా హంసానందిని మాట్లాడుతూ ‘ఇటీవలే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘మిర్చి’ సినిమాలో ఒక పాటలోనూ నటించాను. ఇప్పుడు అదే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘బాయ్’ సినిమాలో ఒక పాటలో నటిస్తున్నానని’ చెప్పింది. ‘మిర్చి’ సినిమా మాదిరిగానే ‘భాయ్’ కూడా హిట్టవ్వాలని కోరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: