పవన్ కళ్యాన్ ఈజ్ బ్యాక్..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  వారసత్వపు హీరోగా వచ్చిన హీరో అయినా తనకంటూ ప్రత్యేక స్టామినా ఏర్పాటు చేసుకున్న నటుడు. కేవలం నటనకే పరిమితం కాకుండా రాజకీయంగా కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాన్.  ఈ సంవత్సరం ఎన్నో అంచనాల మద్య విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఉగాది పండుగ సందర్భంగా విడుదలైనంది. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం జనాలు ఆదరించలేక పోయారు. పవన్ కళ్యాన్ వన్ మాన్ షో  ఉండటం..కథా కథనం బలంగా లేక పోవడంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

దీంతో పవర్ ఇప్పుడు రాబోయే చిత్రంపై అన్ని విషయాల్లో శ్రద్ద వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా ‘కాటమరాయుడు’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఫ్యాక్షన్ తరహాలో ఉండటంతో పాటు అద్భుతమైన సెంటిమెంట్, లవ్ కలగలిపి ఉన్నాయట. అంతే కాదు పవన్ తన స్టైల్ కూడా పూర్తిగా మార్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభమైనా పవన్ మాత్రం షూటింగ్ లో పాల్గొనలేదు.

పవన్ లేకుండానే తొలి షెడ్యూల్ అయ్యింది ఇక రెండో షెడ్యూల్ లో నైనా పవన్ వస్తాడా అన్న టెన్షన్ ఉండేది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు సెట్ లో జాయిన్ అయ్యాడు దాంతో ఆ చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. దీంతో పవన్ కళ్యాన్ షూటింగ్ లో పాల్గొనడంతో హడావిడి మొదలైంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు కాటమ రాయుడు నిర్మాత శరత్ మరార్ పవన్ వచ్చిన విషయాన్నీ తెలియజేస్తూ పవన్ ఫోటో ని కూడా ట్వీట్ చేసాడు . డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


శరత్ మరార్ ట్విట్ :

#Katamarayudu arrives...#PawanKalyan #PSPK pic.twitter.com/ClQxtF33Af

— Sharrath Marar (@sharrath_marar) September 26, 2016

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: