క్లిష్ట పరిస్థితిలో రవితేజ

Prasad
తక్కువ కాలంలోనే అగ్రహీరోలకు దీటుగా ఎదిగిన కథానాయుకుడు రవితేజ. అయితే రవితేజకు గత కొంతకాలంగా కాలం కలసిరావడం లేదు. దొంగలముఠా, వీర, నిప్పు ఇలా అతని చిత్రాలు వరసగా పరాజయం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థతిలో అతన్ని స్టార్ హీరోగా మార్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ మళ్లీ రవితేజను హీరోగా పెట్టి దేవుడు చేసిన మనుషులు రూపొందించాడు. ఈ సినిమా పూర్తయి చాలా రోజులు గడిచిన, విడుదల కోసం ఎదురుచూస్తుంది. అయితే ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమకు గానీ, ఇటు ప్రేక్షకులకు గానీ పెద్దగా ఆసక్తి లేదు. అలాగే రవితేజ ప్రస్తుతం సారొస్తరా అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ టైటిల్ రవితేజకు నచ్చలేదట. ఈ టైటిల్ పై మహేష్ బాబు ప్రభావం కనిపిస్తుందని, కాబట్టి మార్చమని అడుగుతున్నాడట. అయితే దర్శక, నిర్మాతలు పట్టించుకోవడం లేదట. మొత్తానికి రవితేజ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడట. హిట్ లేక పొతే అంతే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: