నాగార్జున పట్టించుకోవట్లేదా?

HANUMA HANUMA
నాగార్జున తన సినిమాలు, తన కొడుకు నాగచైతన్య సినిమాల గురించి మాత్రమే పట్టించుకుంటున్నట్టున్నారు. మేనళ్ళుళ్ళు సుమంత్, సుశాంత్ ల గురించి నామమాత్రమైనా ఆలోచిస్తున్నట్టు లేరు. ఆయన నిజంగా ఆలోచించి వారిమీద దృష్టి పెడితే ఒకరికి ఇద్దరు ఖాళీగా ఉండరని పరిశ్రమ గుసగుసలాడుతోంది.  అక్కినేని నాగేశ్వరరావు వారసులు ఇప్పుడు పరిశ్రమలో నలుగురున్నారు. కొడుకు. మనవడు, ఇద్దరు కూతుర్ల కొడుకులు. నాగ్, చైతూ, సుమంత్, సుశాంతే ఆ నలుగురు. నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య మాత్రం క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చీ ఏఎన్నార్ కూతురు కొడుకులు సుమంత్, సుశాంత్ ఖాళీగా ఉన్నారు.  సుమంత్ ఇటీవల చేసిన గోల్కొండ స్కూలు మంచి హిట్టయింది. అయినా ఆయన తర్వాతి సినిమాల గురించిన ప్రస్తావన లేదు. అలాగే కరెంట్ తో సుశాంత్ మంచి మార్కులే సంపాదించుకున్నారు. అయినా ఇప్పుడు వరుస సినిమాలు చేయట్లేదు. నాగార్జున వీరి మీద దృష్టి సారించి కలుపుకుని పోతే మంచి టీమ్ ఉంటుందన్నది కాదనలేని సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: