తెలుగు సినీమా అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఎస్వీరంగారావు. ఎన్నో చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నర్తనశాల చిత్రంలో కీచుకుడిగా ఎస్వీఆర్ నటనకు జకర్తలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు లభించింది. మనదేశం, పల్లెటూరి పిల్ల, షావుకారు, పాతళభైరవి, మయాబజార్, తాతా మనవడు వంటి చిత్రాలు ఎస్వీఆర్ కు ఎంతో పేరు తీసుకువచ్చాయి. నిజ జీవితంలో మృదుస్వభావి, దాతగా పేరు తెచ్చుకున్న ఎస్వీఆర్ జులై 18, 1974న చెన్నైలో గుండెపోటుతో మరణించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: