నారప్ప : రివ్యూ

shami
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన సినిమా నారప్ప్ప. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా నారప్ప వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబుతో పాటుగా కళైపులి ఎస్ థాను నారప్ప సినిమా నిర్మించారు. ఈ సినిమా అమేజాన్ ప్రైం లో సోమవారం రిలీజైంది. వెంకటేష్ నటించిన నారప్ప ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
నారప్ప (వెంకటేష్) భార్య సుందరమ్మ (ప్రియమణి) కొడుకులు ముని కన్న (కార్తిక్ రత్నం), చిన్నప్ప వారికున్న 3 ఎకరాల భూమిని సాగు చేస్తూ ఉంటారు. అదే ఊరిలో పెద్ద కులానికి చెందిన పండు సామి (ఆడుకులం నరేన్) నారప్ప 3 ఎకరాల మీద కన్నేస్తాడు. ఆ ప్లేస్ లో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాలని అనుకుంటాడు. ఒకసారి పండు సామి కొడుక్కి, నారప్ప పెద్ద కొడుకు మధ్య గొడవ జరుగుతుంది.. ఈ గొడవ కారణంగా నారప్ప కుటుంబం మీద పగ పెంచుకున్న పండు సామి మునికన్నని దారుణంగా చంపిస్తాడు. అన్న చావుకి కారణమైన పండు సామిని నారప్ప రెండో కొడుకు చిన్నప్ప చంపేస్తాడు. పండుసామి కొడుకుల నుండి చిన్నప్పని కాపాడటానికి నారప్ప ఏం చేశాడు అన్నది సినిమా కథ.      
విశ్లేషణ :
ఆల్రెడీ ఒక భాషలో హిట్టైన ఒక సినిమాను అదే విధంగా ఏమాత్రం ఫీల్ మిస్ అవకుండా తెరకెక్కించడం చాలా కష్టం. ముఖ్యంగా అసురన్ ను నారప్పగా తెలుగు రీమేక్ చేయడం కష్టమే ఏమాత్రం తేడా కొట్టినా సినిమా తేలిపోతుంది. ఈ క్రమం లో కోలీవుడ్ అసురన్ ను మక్కీకి మక్కీ దించేశాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే కథలో సోల్ మిస్ అవకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా కులాల మధ్య అంతరాలు, గొడవలు చూపించిన తీరు ఆకట్టుకుంది. తమిళ వర్షన్ జిరాక్స్ కాపీలా తెలుగు నారప్ప ఉన్నాడు.
అయితే స్క్రీన్ ప్లే అంతే గ్రిప్పింగ్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ధనుష్ అసురన్ తెలుగులో వర్క్ అవుట్ అవుతుందా తెలుగు రీమేక్ అదే రేంజ్ లో తీయగలరా అన్న ప్రశ్నలకు పర్ఫెక్ట్ సమాధానంగా నారప్ప ఉంది. రీమేక్ కథలకు మరోసారి తాను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కథ, కథనాలను తెలుగు నేటివిటీకి తగినట్టుగా బాగా రాసుకున్నారు.
అసురన్ సినిమా చూసిన వారికి ఎలా ఉంటుందో చెప్పలేం కాని నారప్ప తెలుగు వర్షన్ అదరగొట్టాడని చెప్పొచ్చు. సినిమా ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. కులాల మధ్య అంతరాల గురించి పర్ఫెక్ట్ గా చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
నటీనటుల ప్రతిభ :
విక్టరీ వెంకటేష్ మరోసారి తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు. నారప్ప పాత్రలో ఆయన అదరగొట్టేశారు. ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్ వేరియేషన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వెంకటేష్ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నారప్ప సినిమాతో మరోసారి రీమేక్ స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇక సినిమాలో ప్రియమణి పాత్ర కూడా ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ప్రియమణికి ఓ మంచి పాత్ర పడ్డదని చెప్పొచ్చు. ముని కన్నగా చేసిన కార్తిక్ రత్నం ఆకట్టుకున్నాడు. రాజీవ్ కనకాల పాత్ర ఆకట్టుకుంది. రావు రమేష్, నాజర్ పాత్రలు ఆకట్టుకున్నాయి. సినిమాలో మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.    
సాంకేతిక వర్గం పనితీరు :
మణిశర్మ మ్యూజిక్ సినిమాకు ఆకర్ష్ణగా నిలిచింది. సాంగ్స్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన డైరక్షన్ టాలెంట్ చూపించారు. తమిళ అసురన్ ను డిటో దించేసినట్టు అనిపించినా మేకింగ్ పరంగా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
వెంకటేష్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ కొద్దిగా స్లో అనిపించడం
బాటం లైన్ :
నారప్ప వెంకటేష్ పర్ఫెక్ట్ రీమేక్..!
రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: