సినిమాటోగ్రఫీ ,కళ్యాణ్ రామ్(నిర్మాతగా) ,కామెడీ సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్ మరియు పోస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ ,కళ్యాణ్ రామ్(నిర్మాతగా) ,కామెడీ సన్నివేశాలు, ప్రీ ఇంటర్వెల్ మరియు పోస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాలుపాత్రల మధ్యన బంధం ,కొన్ని పొడవాటి సన్నివేశాలు, ఎమోషన్ లేని క్లైమాక్స్, సంగీతం, పలుసార్లు చూసేసిన కథకళ్యాణ్ (నందమూరి కళ్యాణ్ రామ్) ఒక పోలీస్ అధికారి , పట్టుబట్టి తన పోస్టింగ్ ని హైదరాబాద్ కి మార్పించుకుంటాడు. హైదరాబాద్ రాగానే డిజిపి కృష్ణ ప్రసాద్ (సాయి కుమార్ ) ని విసిగించడం మొదలు పెడతాడు. అవినీతి పనులు చేస్తూ దొంగలకి, కబ్జాలకి సాయంగా నిలుస్తు కృష్ణ ప్రసాద్ కి తలనొప్పిగా మారుతాడు. ఇదంతా తను కావాలనే చేస్తున్నట్టు కృష్ణ ప్రసాద్ కి చెప్తాడు కళ్యాణ్. ఇదిలా నడుస్తుండగా రాష్ట్ర రాజకీయాన్ని తన ఇంటి నుండి నడిపే జికే(అసుతోష్ రానా) ని ఎలాగయినా అరెస్ట్ చెయ్యాలని కృష్ణ ప్రసాద్ అనుకుంటాడు. కృష్ణ ప్రసాద్ ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా జికే తన పలుకుబడితో తప్పించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన కళ్యాణ్ జికే కి అండగా నిలబడి కృష్ణ ప్రసాద్ కి మరింత తలనొప్పిగా మారుతాడు . అయినా అన్నింటిని ఓపిగ్గా భరిస్తూ వస్తాడు కృష్ణ ప్రసాద్, ఒకానొక సంఘటన వద్ద కళ్యాణ్ లో అనుకోని మార్పు వస్తుంది అప్పటివరకు జికే కి అండగా నిలిచిన కళ్యాణ్ ఎదురు తిరుగుతాడు .. కళ్యాణ్ ఎందుకు ఎదురు తిరిగాడు ? ఆ సంఘటన ఏంటి? కృష్ణ ప్రసాద్ కి మరియు కళ్యాణ్ కి ఉన్న సంభంధం ఏంటి? అనేది మీరు తెర మీద చూడాల్సిందే...కళ్యాణ్ రామ్ , విభిన్న చిత్రాలు చెయ్యడంలో ఎప్పుడు ముందుండే ఈ నాయకుడు ఈసారి దానికి విభిన్నంగా రొటీన్ చిత్రం చేసారు. చిత్రం మొత్తం తన భుజాల మీద వేసుకొని మోసాడు, కొన్ని ఎలివేషన్ సన్నివేశాల వద్ద ఆయన స్క్రీన్ ప్రేజేన్స్ సరిపోలేదు అనిపించినా ఆయన స్థాయికి మించి ఈ చిత్రం కోసం కష్టపడిన విధానం మాత్రం మెచ్చుకోదగ్గది, అంతే కాకుండా పోలీస్ లాగా కనిపించి అలరించాడు, కామెడీ టైమింగ్ బాగా మెరుగుపరుచుకున్నారు. పంచ్ డైలాగు లు చెప్పే సమయంలో ఎమోషన్ సరిపోలేదు అనిపిస్తుంది ఈ విభాగంలో ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుంటుంది. శృతి సోది , అన్ని కమర్షియల్ చిత్రాలలో లానే ఈ చిత్రంలో కూడా కథానాయిక పాత్ర పాటలకి కనిపించే వరకే పరిమితం అయ్యింది. పాటల్లో తన అందాలతో కొన్ని డాన్స్ లతో బాగానే ఆకట్టుకుంది.. కాని చాలా సిల్లీ పాత్ర ఇది కొన్ని సార్లు విసిగించింది కూడా, సాయి కుమార్ ఎప్పటిలానే తన కంఠంతో మరియు అభినయంతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే సన్నివేశం చిత్రానికి వెయ్యి వోల్ట్ ల పవర్ అందించింది.. ప్రాచి థక్కర్ తన అభినయంతో ఆకట్టుకుంటుంది , ఈ పాత్రకు సరిగ్గా సరిపోయింది. కీర్తి శేషులు మైలవరపు సూర్య నారాయణ (ఎం ఎస్ నారాయణ) పాత్ర చాలా ఆకట్టుకుంది, చివరి రోజుల్లో నటించినా అయన టైమింగ్ ఎక్కడా మిస్ అవ్వలేదు .. ఇంకా విలన్ పాత్రలో కనిపించిన అసుతోష్ రానా అయన పాత్రకి తగ్గ ప్రదర్శన కనబరిచారు. జయప్రకాశ్ రెడ్డి , పోసాని కృష్ణ మురళి, షకలక శంకర్, కాశి విశ్వనాధ్ అక్కడక్కడా కనిపించి అప్పుడప్పుడు నవ్వించారు. శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయి కమెడియన్ గా చాలా రోజుల తరువాత నటించారు. అయన టైమింగ్ తో చాలా చోట్ల ఆస్కారం లేకపోయినా కామెడీని రప్పించగలిగారు. మిగిలిన అందరు నటీనటులు సన్నివేశానికి తగ్గ నటన కనబరిచారు..కథాపరంగా ఈ చిత్రం కొత్తగా ఎం ఉండదు, ఒక చెడు పోలీస్, ఒక క్రూర విలన్, ఒక చేదు సంఘటన, మారిపోయిన పోలీస్, దొరికిపోయిన విలన్. ఈ ఫార్మటులో ఇప్పటికే చాలా చిత్రాలు చూసాం కాని అనిల్ రావిపూడి చాలా తెలివిగా కథనం విషయంలో జాగ్రత్త పడ్డాడు చిత్రంలో ఎప్పటికప్పుడు కావలసిన మసాలా అంశాలు ఉండేలా చూసుకున్నాడు ఒకసారి చిత్రం నెమ్మదిస్తున్న సమయంలో మంచి కామెడీ సన్నివేశం, మరోసారి మంచి పాట, ఇంకొకసారి మంచి ఫైట్ ఇలా నీటి మీద పడవలా నెమ్మదిగా చిత్రాన్ని ఒడ్డుకి చేర్చేసాడు. కాని రచయిత కృష్ణ దగ్గర నుండి మాత్రం సరయిన డైలాగ్స్ రాబట్టుకోలేకపోయారు.. ఎమోషన్ తారాస్థాయిలో ఉన్న సన్నివేశం దగ్గర ఉపయోగించిన పదాలు ఆ ఎమోషన్ ని ఎలివేట్ చెయ్యలేకపోయాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించి ఉండాల్సింది. ఇక కథనంలో రెండవ అర్థ భాగంలో చిత్రం కొన్ని చోట్ల నెమ్మదిస్తుంది, ఈ విషయం పై కూడా కాస్త దృష్టి సారించి ఉండాల్సింది.దర్శకత్వం విషయానికి వస్తే కొత్త వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించే కళ్యాణ్ రామ్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగారు అనిల్ రావిపూడి. .. సర్వేశ్ మురారి అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన హైలెట్, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల దగ్గర ఇతని సినిమాటోగ్రఫీ ఫైట్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. సాయి కార్తీక్ అందించిన సంగీతంలో "అరె ఓ సాంబ" పాట వినడానికి మరియు తెర మీద చూడటానికి కూడా బాగుంది మిగిలిన పాటలు ఒక్కటి కూడా చిత్రం అయిపోయాక గుర్తుండదు. ఈ చిత్రానికి ఉన్న మైనస్ లలో ఇతని సంగీతం కూడా ఒకటి. పలు సన్నివేశాలకు అందించిన నేపధ్య సంగీతం వేరు వేరు చిత్రాలలో నేపధ్య సంగీతాన్ని పోలి ఉంటుంది ముఖ్యంగా తమన్ పని చేసిన చిత్రాలను పోలి ఉంటుంది. ఎడిటింగ్ చాలా సజావుగా సాగిపోతుంది కాస్త వేగంగా కూడా కదిలింది కాని కొన్ని సన్నివేశాలు రిపీట్ అయ్యాయి అవి కూడా కత్తిరించి ఉంటె మరింత బాగుండేది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి , నిర్మాత కూడా తనే అవ్వడంతో కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజి పడినట్టు కనిపించదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.ప్రేక్షకుడు చిత్రానికి వచ్చేది వినోదం కోసమే, ఆ వినోదం అందించడానికి కొన్నిసార్లు పలు హిట్ చిత్రాలను ఉపయోగించుకుంటాం అని దర్శకుడు విలేఖర్ల సమావేశం లో అన్న మాటలు, ఈ చిత్రం మొత్తం దర్శకుడు ఈ మాటకి కట్టుబడి ఉన్నాడు. చిత్రం ఆసాంతం పలు చిత్రాల ఛాయలు కనిపిస్తాయి , లక్ష్మి నర్సింహా , జగపతి, పవర్ ఇలా ఇదే కథ మీద వచ్చిన పలు చిత్రాలు చాలానే ఉన్నాయి కాని వాటికి ఈ చిత్రానికి తేడా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు కాని దర్శకుడు భవిష్యత్తు లో కొత్తదనం కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది. ఒక నూతన దర్శకుడిని నమ్మి చిత్రం చెయ్యడం గురించి మాత్రం కళ్యాణ్ రామ్ ని మెచ్చుకొని తీరాల్సిందే. కాని ఈ చిత్రం విజయవంతం అయ్యింది కదా అని అయన కూడా ఇదే మూసలో చిత్రాలు చేస్తారని అనుకోవట్లేదు.. ఎప్పటిలానే విభిన్న చిత్రాలతో మన ముందుకి వస్తాడని ఆశిద్దాం.. ఈ పండక్కి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదని తెలుగు ప్రేక్షకులు నిరుత్సాహపడి ఉంటారు. వారి ఎదురుచూపు ఈ చిత్రంతో తీరిపోతుంది. కచ్చితంగా చూసేయ్యాలి అనే చిత్రం కాదు .. ఏదో ఒక చిత్రం కచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం ఈ చిత్రం చూడండి..Kalyan Ram,Shruti Sodhi,Anil Ravipudi,Sai Karthik.పటాస్ - టైం పాస్ ..
మరింత సమాచారం తెలుసుకోండి: