వీకెండ్ లవ్ : రివ్యూ

శేఖర్ చంద్ర సంగీతం,సినిమాటోగ్రఫీశేఖర్ చంద్ర సంగీతం,సినిమాటోగ్రఫీకథ,ఊహాజనితం అయిన కథనం,ఇప్పటికే చాలాసార్లు చూసేసిన సన్నివేశాలు,బలవంతంగా జొప్పించిన కామెడీ,ఎడిటింగ్

గణేష్ (ఆదిత్) సరదాగా తిరిగే ఒక యువకుడు అందమైన అమ్మాయిలను తన మాటలతో ఆకట్టుకొని ప్రేమలో పడేలా చేస్తుంటాడు అలాంటి గణేష్ కి ఒకరోజు సంధ్య చటర్జీ(శైలజ సుప్రియ) పరిచయం అవుతుంది. సంధ్యతో నిజమయిన ప్రేమలో పడతాను గణేష్. సంధ్య విశ్వా ఐటీ సోలుషన్స్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంటుంది. సంధ్య కూడా గణేష్ ని ఇష్టపడటం మొదలుపెద్తుంది కాని ముందు స్నేహితులుగా సహజీవనం చేసి అందులో వారి జీవితం ఎలా ఉంటుందో గమనించి తరువాత వారి బంధాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయించుకుంటారు. ఈ సమయంలో గణేష్ లో కాస్త మార్పు రావడం మొదలుపెడుతుంది అది సంధ్యకి బాగా నచ్చుతుంది కాని గణేష్ జీవితంలో గతంలో ఉన్న ఒక అమ్మాయి వీరి మధ్యలోకి రావడంతో పరిస్థితులు తారుమారు అయిపోతుంది. ఆ తరువాత వారి సహజీవనం ఎలా సాగింది? వీరి ప్రేమ ఏమయ్యింది అన్నదే మిగిలిన కథ...

ఈ చిత్రంలో నటనాపరంగా అందరు నటులు ఆకట్టుకున్నారు ముఖ్యంగా ఆదిత్ అరుణ్ మరియు సుప్రియ శైలజ వారి వారి పాత్రలలో సరిగ్గా ఒదిగిపోయారు. సుప్రియ శైలజ తన టైమింగ్ తో మరోసారి బాగా ఆకట్టుకుంది. ఆదిత్ తన పాత్రలో బాగా సరిపోయాడు కాని వీరి మధ్యన కెమిస్ట్రీ మాత్రం సరిగ్గా కుదిరినట్టు అనిపించలేదు. ఎం ఎస్ నారాయణ, తాగుబోతు రమేష్, శ్రీనివాస రెడ్డి , అపూర్వ మరియు కృష్ణ భగవాన్ చాలా చిన్న పాత్రలలో కనిపించారు. కీ||శే శ్రీహరి పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకుంది ..

వీకెండ్ లవ్ కథ చాలా సన్నమయినది అంతే కాకుండా ఈ చిత్రాన్ని నేరేట్ చేసిన విధానం కూడా చాలా రొటీన్ గా ఉంటుంది , దర్శకుడు నాగు గారవ ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో పూర్తిగా విఫలం అయ్యాడు. మొదటి చిత్రాన్ని విభిన్నంగా చెయ్యడం కన్నా పూర్తిగా సేఫ్ ప్రాజెక్ట్ చెయ్యాలని నిర్ణయించుకొన్నారు ఈ దర్శకుడు , ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలలో నుండి కొన్ని అంశాలను తీసుకొని అన్నింటిని ఒక క్రమంలో కూర్చి చిత్రంగా మలిచారు.. కొన్ని అనవసరమయిన ప్రదేశాలలో రొమాంటిక్ సన్నివేశాలను మరియు పాటలను జోప్ప్పించి కథలో ఉన్న కాస్తో కూస్తో ఫ్లేవర్ నికూడా పోగొట్టాడు. సినిమాటోగ్రఫీ అందించిన జి ఎస్ రాజు ఈ చిత్రానికి కావలసిన మూడ్ ని అయితే సృష్టించగలిగారు కాని రెండవ అర్ధభాగంలో వచ్చే సన్నివేశాలలో బలం లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అక్కడక్కడా వచ్చే కొన్ని సంభాషణలు గిలిగింతలు పెడతాయి . చిత్రంలో రెండు పాటలు బాగున్నాయి అంతే కాకుండా నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. రెండవ అర్ధ భాగంలో కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి...

చిన్న చిత్రాలు చాలానే వస్తుంటాయి కాని అన్ని చిత్రాలు ఒకేలా ఉంటున్నాయి గత కొంతకాలంగా గమనిస్తే చిన్న చిత్రల్లలో డబ్బై శాతం చిత్రాల వరకు రొమాంటిక్ చిత్రాలే అవి కూడా అన్ని ఒకేలా ఉంటున్నాయి ఈ చిత్రం కూడా ఆ కోవలోకి చెందినదే. మొదటి అర్ధ భాగం బాగుంది అనిపించగానే అతి బలహీనం అయిన రెండవ అర్ధ భాగం పూర్తిగా ప్రేక్షకులను విసుగు పెట్టిస్తుంది. కాస్త వేగవంతం అయిన కథనం మరియు సరయిన క్లైమాక్స్ ఉంది ఉంటె ఈ చిత్రం కాస్త ఆకట్టుకునేది కూడా, కాని దర్శకుడు సేఫ్ సైడ్ ఉండిపోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో చిత్రం ఘోరంగా దెబ్బ తినింది. వేరేసి ఈ చిత్రం అటు సరయిన హాస్యాన్ని పండించలేకపోయింది ఇటు పూర్తి రొమాంటిక్ చిత్రంగాను మిగల్లేదు...

Aadhith,Supriya Shailaja,Nagu Gavara,Madhu Thota,Sekhar Chandra.చివరగా : వీకెండ్ లవ్ - "వీక్" ఎండ్ చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: