జెఫ్ఫా : రివ్యూ

Prasad

Jaffa: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

  హాస్యనటుడుగానే హీరో స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు బ్రహ్మానందం. హాస్యనటుడుగానే కొన్ని సినిమాలను హిట్ చేసిన బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జఫ్ఫా’. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి బ్రహ్మానందం ‘జఫ్పా’ ఎలా ఉన్నాడో చూద్దాం...! చిత్రకథ :     జాస్మిన్ ఫాల్గున (బ్రహ్మానందం) ఒక స్టాఫ్ వేర్ ఉద్యోగి. తన బాస్, తన సహోద్యోగి కారణంతో అతను జైలు పాలువుతాడు. జైలులో అతను ఎదుర్కొన్న పరిస్థితులు, అక్కడి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు, జైలు నుంచి తప్పించుకున్న అతను ఎలాంటి పరిస్థితిలో చిక్కుకున్నాడు... అనే అంశాలతో సినిమా సాగుతుంది.

advertisements


నటీనటుల ప్రతిభ : బ్రహ్మానందం నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవల్సిన పనిలేదు. అయితే ‘జఫ్పా’ లో అతని నటన గురించి చెప్పుకోవాలి. సినిమాలో చిన్న పాత్రలతో ఆకట్టుకునే బ్రహ్మానందం తనే ప్రధాన పాత్రలో నటిస్తున్నప్పుడు చాలా శ్రద్ధ తీసుకోవాలి. అతను ఈ  సినిమా  కోసం ఎలాంటి ప్రత్యేక శ్రద్ధా తీసుకోలేదు. బ్రహ్మి నటన ఎప్పటి మాదిరిగానే ఉంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకునే విధంగా ఉన్నా... అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. అయితే, బ్రహ్మానందాన్ని చూడాలని వెళితే మిగిలిన హస్యనటులు ఆకట్టుకుంటారు. శవపేటికలో బ్రహ్మనందం చిక్కుకుని పోయిన సన్నివేశాలు, జైలులో కామెడి దృశ్యాలు, కాటికాపరిగా తాగుబోతు రమేష్ నటన బాగున్నాయి. అలీ కామెడీ పెద్దగా నవ్వించదు. మిగిలిన నటులు గురించి చెప్పుకోవడాని లేదు. సాంకేతిక వర్గం పనితీరు :   ఫోటోగ్రఫీ చాలా చీప్ గా ఉంది. తక్కువ క్వాలిటీతో తర్వగా చుట్టివేసినట్లు ఉంది. పాటలు లేవు. దర్శకుడు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో జైలర్ గా నటించడంతో పాటు, సంభాషణలు కూడా అందించాడు. అతను దర్శకుడిగా కంటే ఈ సినిమాలో మాటల రచయితగానే మెప్పిస్తాడు. పంచ్ లైన్ మాటలతో పాటు ‘రెండు పాత్రలు న్వువే పోషించావా.. తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు రమ్మంటే ఎక్కడ్నించి వస్తాయి’ వంటి మాటలూ మెప్పిస్తాయి. అయితే ‘మీది ఎక్కడ’ అన్న మాటను ద్వంద్వార్థంతో చూపించడం బాగోలేదు. ఈ సినిమా చూసినవారు ‘మీది ఎక్కడ’ అనే మాటను ఉపయోగించలేరు. దర్శకత్వం విషయానికి వస్తే ఈ సినిమాను బ్రహ్మానందం ఇమేజ్ తోను, కామెడీ దృశ్యాలతోనూ నడిపించాలని చూశాడు. స్టార్ హీరోలే సరిగ్గా చేయలేనప్పుడు ప్రేక్షకులు పట్టించుకోరు. బ్రహ్మి అయినా అంతే. జైల్లో వేణు కామెడి దృశ్యాలు, ఖైదీలు ఏ నేరం చేసి వచ్చారో చూపించండం, శశ్మానం సీన్లు నవ్విస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. ముగింపు కూడా సాధారణంగా ఉంది.  విశ్లేషణ : హాస్యనటుడిగా మంచిగా అవకాశాలు వస్తున్న సమయంలో దర్శకత్వం మీద మోజు పడ్డాడు వెన్నెల కిషోర్. ‘వెన్నల 1 1/2’తో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఆ సినిమాతోనే ‘ఇతనికి దర్శకత్వం ఎందుకు’ అనిపించకున్నాడు. అయితే ఆ సినిమా చూసిన వారు ‘జఫ్పా’ చూస్తే వెన్నెల కిషోర్ దర్శకుడిగా కొంచెం మెరుగ్గాయ్యాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ‘జఫ్పా’తో సినిమా అంతా బోర్ కొట్టించడు. ఆ సినిమాతో సుత్తితో కొడితే ఈ సినిమాతో కర్రతో కొట్టినట్లు అనిపిస్తుంది. బ్రహ్మానందం ఏం చేసినా నవ్వుకునే వారు, సినిమాతో సంబంధం లేకుండా అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్లు చూడ్డానికి ఇష్టపడే వారు ఈ సినిమా చూడొచ్చు.    చివరగా : ‘జఫ్పా’ most watched కాదు just watched movie !

More Articles on Jaffa || Jaffa Wallpapers || Jaffa Videos


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: