ట్వీట్ రివ్యు: గ్రీకు వీరుడు
Greeku Veerudu: Tweet Review || తెలుగు ఫుల్ రివ్యూ || English Full Review
10:06am: గుడ్ మార్నింగ్ ఎపిహెరాల్ద్.కామ్ రీడర్స్, కింగ్ నాగార్జున గ్రీకువీరుడు సినిమా ట్వీట్ రివ్యూ కి మీకు స్వాగతం
10:27am: న్యూ యార్క్ సిటీ అందాలను కవర్ చేస్తూ టైటిల్స్ వస్తుంటే... మస్త్ బైక్ పైన నాగార్జున ఇంట్రడక్షన్ చూడడానికి బావుంది
10:29am: హీరో ఇంట్రడక్షన్ పాట ఐ హేట్ లవ్ స్టోరీస్ ... నాగార్జున గత సినిమాల కన్నా యంగ్ గా కనిపిస్తున్నాడు .
10:33am: బ్రంహనందం ఇంట్రడక్షన్ నవ్వులు తెప్పిస్తున్ది. నయన తార పరిచయం చాలా స్వీట్ గా వున్ది.
10:38am: మీరా చోప్రా రూపంలో చిన్న ట్విస్ట్ నాగర్జున & కో కి.
10:38am: డైరెక్టర్ సినిమాలోనే సాధ్యం అయ్యే సన్నివేశాలను చూపిస్తున్నాడు.
10:41am: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలయ్యిన్ది. ఎస్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్లాష్ బ్యాక్ కి ఆయువు పట్టు లాగా వుంది
10:44am: కళా తపస్వి కె. విశ్వనాథ్ ని స్రీన్ మీద చాలా రోజుల తరువాత, ఫ్లాష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అయన పాత్ర బావుంది
10:48am: సినిమా ప్రస్తుతానికి వచ్చింది, నాగార్జున -నయన తార ని పడెయ్యడానికి చేస్తున్న పనులు బావున్నాయి
10:50am: దశరథ్ మార్క్ కుటుంబ సన్నివేశాలు మొదలయ్యాయి, ఇప్పటి వరకు సినిమా ఫర్వాలెదు
10:54am: దశరథ్ సినిమా అంటేనే స్లో పేస్ మూవీ ... కానీ గ్రీకు వీరుడు ఇంకా స్లో గా ఉన్నట్లుంది. స్టూడెంట్స్ అండ్ యూత్ కి కొంచెం బోర్ అనిపిస్తున్నట్లుంది.
10:56am: హమ్మయ్య! కామెడీ ఎపిసోడ్ మొదలయ్యింది. కోవై సరళ - ఎమ్మెస్ నారాయణ మధ్య లవ్ సన్నివేశాలు బాగానే పండాయి స్రీన్ మీద.
10:58am: నాగార్జున కామెడి ఎపిసోడ్ కూడా చూడ ముచ్చటగా వుంది, క్లీన్ కామెడీ, అందరు ఎంజాయ్ చేస్తున్నారు.
11:02am: ఓహ్ నారి వాషింగ్టన్ పాట - కెమెరా పనితనం బావుంది. బాలు వాయిస్ తో ఈ పాట వీనుల విందు గా వుంది
11:05am: నయన తార -నాగార్జున మధ్య కెమిస్త్రీ చాలా బావున్ది. వీళ్ళిద్దరు కలిసి పాటకు ప్రాణం పోశారు
11:08am: సీనియర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాసరావు పరిచయం పవర్ ఫుల్ గా వుంది
11:10am: మళ్ళీ సినిమా గాడి తప్పినట్లుంది. బాగా స్లో పేస్ లో వెళ్తుంది, అంత ఇంటరెస్ట్ అనిపించడం లెదు.
11:35am: స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ చేసిన ప్రయోగం వికటించినట్లున్ది. సినిమా ఇంకా బోర్ గా తయారవుతున్ది.
11:40am: ప్రేమ, అభిమానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ' ఎవరు లేరు అని ' సాంగ్ వచ్చింది - పాట ఫర్వాలేదు
11:43am: సినిమాలో ఫస్ట్ ఫైట్ వస్తుంది - చాలా క్లాస్ గా షూట్ చెసారు.
11:46am: కె. విశ్వనాథ్ మరియు నాగార్జున మథ్య చూడ చక్కని సెంటిమెంట్ సీన్స్ నడుస్తున్నాయ్
విశ్రాంతి
12:03pm: గ్రీకు వీరుడు - సెకండాఫ్ లో నాగార్జున కొంచెం ఎజ్ద్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు. హీరో కారక్టర్ లో వేరిఎషన్ బావుంది
12:10pm: 'నే విన్నది నిజామా' పాటలో నాగార్జున జబర్దస్త్ స్టెప్స్ కి హాల్ లో విజిల్స్ ... గొడవ గొడవ
12:15pm: Mr. ఫర్ ఫెక్ట్ సినిమా ని తలదన్నే రేంజ్ లో భారీ ఎమోషనల్ సీన్స్ . నాగార్జున తన పరిణితి చెందిన నటన తో పాత్ర లో జీవిస్తున్నాడు
12:18pm: జీవితం గురించి కె.విశ్వనాథ్ చెప్తున్న ఫిలాసఫీ మాటలు బావున్నాయి
12:23pm: డాక్టర్ కామరాజు గా బ్రంహానందం నవ్వులు పూయిస్తున్నాడు
12:28pm: ఇంతలోనే బ్రంహానందం సలీం గా అవతారం ఎత్తాడు. హాల్ లో విజిల్స్ - గోల గోల
12:30pm: చాలా కాలం స్క్రీన్ మీద కనపడని ధర్మవరపు సుబ్రహ్మణ్యం - కామెడీ రోల్ బావున్ది.
12:35pm: కోన వెంకట్ ఫన్నీ వన్ లైనర్ మాటలు చాలా బావున్నాయి
12:38pm: 'గ్రీకు వీరుడు' మాస్ సాంగ్ - నాయన తార చాలా హాట్ ఫోజేస్ తో హాట్ హాట్ గా కన్పిస్తున్ది.
12:40pm: మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తయిన ఎమోషనల్ దృశ్యం! దశరథ్ సినిమాలలో మాత్రమే ఇలాంటి సీన్స్ ఉంటాయేమో
12:42pm: ఇంతలోనే మళ్ళీ సినిమా స్లో పేస్ లో కి వెళ్ళింది