బెంగాల్ టైగర్ : రివ్యూ
ఆత్రేయపురం, ఆ ఊరికి పెద్ద అయిన జయనారయన్(నాగినీడు). ఆయన ముగ్గురు కుమారులలో ఒకడైన ఆకాష్ నారాయణ్(రవితేజ) మన హీరో. చదువు పూర్తి చేసుకొని లక్ష్యం అనేది లేకుండా జాలీగా ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరిగే ఆకాష్ కి పెళ్లి చేస్తే సెట్ అవుతాడని అక్షతో పెళ్లి చూపులు సెట్ చేస్తారు. కానీ అక్ష ఏమో నాకు మొగుడు కావాలంటే నువ్వు బాగా ఫేమస్ అయ్యుండాలని, నువ్వు ఫేమస్ కాదు కాబట్టి పెళ్ళికి నో అంటుంది. ఆ మాటలకు బాగా హర్ట్ అయిన ఆకాష్ ఉన్నపలంగా ఫేమస్ అయిపోవాలి అనుకుంటాడు. దాని కోసం ఓ రోజు ప్రజాసేవ పార్టీ మినిష్టర్ అయిన సాంబు(సాయాజీ షిండే) మీటింగ్ ని చెడగొట్టి ఫేమస్ అవుతాడు. అలా మినిష్టర్ అయిన నాగప్ప(రావు రమేష్) దృష్టిలో పడి అయన కుమార్తె శ్రద్ధ(రాశీఖన్నా)కి బాడీ గార్డ్ అవుతాడు. తన హీరోయిజం చూసి శ్రద్ధ ఆకాష్ లవ్ లో పడుతుంది. అక్కడే ఓ చిన్న ట్విస్ట్.
కట్ చేస్తే అక్కడి నుంచీ కథ సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) - ఆకాష్ ల మధ్యకి షిఫ్ట్ అవుతుంది. దాంతో కథలోకి సిఎం కుతురు అయిన మీర(తమన్నా) కూడా ఎంటర్ అవుతుంది. అసలు ఆకాష్ - సిఎం అశోక్ గజపతి మధ్య జరిగిన యుద్ధం ఏమిటి? ఆ యుద్దంలో గెలుపెవరిది? అసలు ఆకాష్ అనే వాడికి నిజంగానే ఫేమస్ అవ్వాలి అనే పిచ్చి ఉందా? లేక వేరే దేనికోసమైన సిఎం అశోక్ గజపతితో పెట్టుకున్నాడా? అన్నది వెండితెరపై చూసి తెలుసుకోండి.
మాస్ మహారాజ్ అయిన రవితేజ తన సూపర్ లుక్ ని వదులుకొని డైట్ చేసి బాగా సన్నగా అయిన తర్వాత చేసిన రెండవ సినిమా ఇది. కిక్ 2 లో ఫేస్ లో బాగా ముసలి పోలికలు కనిపించాయి. ఇక సినిమా విషయానికి వస్తే రవితేజ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. దానివలన చాలా చోట్ల యంగ్ గా కనిపించినా కొన్ని చోట్ల మాత్రం తన వయసు కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాలో 90% రవితేజ ఫేస్ యంగ్ గా కనిపించడం కోసం సిజి వర్క్ ని వాడారు. ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. రవితేజ మాస్ మసాలా పాత్రలు చేయడం, పంచ్ డైలాగ్స్ చెప్పడం బట్టర్ తో పెట్టిన విద్య. కావున ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా చేసుకొని వెళ్ళిపోయాడు. ఇందులో తను కొత్తగా నటనలో చూపిన వైవిధ్యం ఏమీ లేదు. ఇకపోతే తనకి డిజైన్ చేసిన పాత్ర కూడా కొత్తదేమీ కాదు, గత సినిమాల్లో చేసిన పలు పాత్రలను గుర్తు చేసేలానే ఉంది. ఇక హీరోయిన్స్ లో తమన్నా గ్లామర్ డాల్ గా కనిపించింది. తన నటనకి ప్రాధాన్యం ఉన్న సీన్స్ లో బాగానే చేసినా, తనని ఎక్కువగా గ్లామర్ పరంగానే వాడుకోవడం వలన ఆడియన్స్ కి తన అందాల విందు మాత్రమే గుర్తుంటుంది.
ఆడియో రిలీజ్ నుంచే హైప్ పెంచిన చూపులతో దీపాల పాటలో రవితేజ కనపడకుండా పోయేలా అందాలు ఆరబోసింది. ఇక రాశీ ఖన్నా కాస్త పొగరున్న పాత్ర చేస్తోంది అనిపించినా ఫైనల్ గా తను కూడా ఓ గ్లామర్ అట్రాక్షన్. మొదటి సారి రాశీ ఖన్నా కూడా తన గ్లామర్ డోస్ ని పెంచి ఏకంగా బికినీలో కనువిందు చేసింది. ఇక రాజసం చూపే సిఎంగా, తనకు అడ్డొచ్చే వారిని పరలోకాలు పంపే కౄరత్వం ఉన్న మెయిన్ విలన్ గా బొమన్ ఇరానీ చాలా సెటిల్ గా చేసిన పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది. ఇక కమెడియన్స్ లో పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృద్వీ బాగా నవ్వించే ప్రయత్నం చేయగా, సత్యం రాజేష్, శకలక శంకర్ లు పరవాలేధనిపించారు.
ఇక అమలా పాల్ గా బ్రహ్మానందం మరోసారి నవ్వించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రావు రమేష్, హర్షవర్ధన్ రాణే, నాగినీడు, సాయాజీ షిండే, బ్రహ్మాజీ, పవిత్రా లోకేష్, ప్రియదర్శిని రామ్ లు తమ తమ పాత్రల్లో ఓకే అనిపించారు. ఇక అతిధి పాత్రల్లో కనిపించిన అక్ష, హంసా నందినిలు ఎవరి తరహాలో వారు ఆకట్టుకున్నారు.
'రచ్చ' అనే సినిమా తర్వాత బాగా గ్యాప్ రావడం వలన సంపత్ నందికి కచ్చితంగా ఓ హిట్ కావాలి. దానికోసం ఆయన ఎలాంటి రిస్క్ చేయకుండా స్రీన్ ప్లే తో మాయ చేసేద్దామని, కొత్తగా అనిపించే ఓ చిన్న పాయింట్ ని తీసుకొని రొటీన్ మాస్ మసాలా ఫార్మాట్ లోనే సేఫ్ గేమ్ ఆడేద్దాం అని చేసిన సినిమానే 'బెంగాల్ టైగర్'.
రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకి వీరాభిమానులైన వారు, రవితేజ ఫాన్స్, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకునే బ్యాచ్ మాత్రమే ఈ సినిమా చూడటానికి అర్హులు. వాళ్ళకి కూడా నేనిచ్చే సలహా ఒక్కటే ఫస్ట్ హాఫ్ చూసి బయటకి వచ్చేయండి, దాంతో మీకు ఓ మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది. మిగతా వారైతే ఇదేం సినిమారా బాబు అంటూ తలపట్టుకొని బయటకి వచ్చే సినిమానే 'బెంగాల్ టైగర్'.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Bengal Tiger
-
West Bengal - Kolkata
-
Telugu
-
Cinema
-
ravi teja
-
Mass
-
krishna
-
Comedy
-
akash
-
marriage
-
Pelli Choopulu
-
aksha
-
Husband
-
Party
-
ashok
-
war
-
Kick 2
-
Masala
-
Butter
-
Heroine
-
tamannaah bhatia
-
Audience
-
Rashi Khanna
-
sathyam
-
shankar
-
amala paul anaka
-
brahmanandam
-
priyadarsini
-
Athidhi
-
sampath
-
Hero
-
Episode
-
Govinda
-
ravi anchor
-
Manam
-
Director
-
Murder
-
Murder.
-
Music
-
gautham new
-
gautham
-
gowtam
-
ram pothineni
-
lakshman
-
Jabardasth
-
sree
-
maya
-
GEUM
-
CBN