శ్రీమంతుడు : రివ్యూ
శ్రీమంతుడు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మహేష్ బాబు వన్ మాన్ షో. మహేష్ ఒక్కడే ఈ సినిమాని పూర్తిగా నడిపించే బాధ్యతను తీసుకోవడమే కాకుండా తన పార్ట్ ని 100కి 200% సమర్ధవంతంగా నిర్వర్తించాడు. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో ట్రై చేసిన పాత్ర చాలా కొత్తగా ఉండడమే కాకుండా, ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మొదట్లో సంతృప్తిగాలేని ఓ రిచ్ కిడ్ గా, ఆ తర్వాత హన్డ్సం కాలేజ్ స్టూడెంట్ గా, ఆ తర్వాత ఊరిని డెవలప్ చేసే యువకుడిగా, ఆ తర్వాత ఫ్యామిలీ బాధ్యతని తీసుకొనే కొడుకుగా.. ఇలా ఇన్ని వేరియేషన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు మహేష్. ఇన్ని వేరియేషన్స్ లో తన లుక్ ని కూడా మార్చుకుంటూ వచ్చిన విధానం చాలా బాగుంది. ఇదంతా ఒక ఎత్తైతే మహేష్ బాబు ఈ సినిమాలో ఓ రెండు మూడు పాటల్లో తన డాన్స్ మొమెంట్స్ తో ఫ్యాన్స్ చేత డాన్సులు చేయిస్తాడు. ముఖ్యంగా చారుశీల సాంగ్ లో మైఖేల్ జాక్సన్ స్టెప్స్ ని వేసిన తీరు బాగుంది. శృతి హాసన్ క్యూట్ లుక్స్ మరియు డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. పాటల్లో అయితే బాగా గ్లామరస్ గా కనిపించి అందాలతోనూ ఆకట్టుకుంది. జగపతి బాబు - రాజేంద్ర ప్రసాద్ ల పాత్రలు ఈ సినిమాకి చాలా కీలకం, వారి పాత్రల్లో వారు మంచి నటనని కనబరచడమే కాకుండా.. సినిమాలో ఎమోషనల్ డెప్త్ ని తీసుకువచ్చారు. విలన్ గా సంపత్, హరీష్, ముఖేష్ రుషిలు హీరోకి గట్టి పోటీని ఇచ్చారు. ఇక సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన సుకన్య, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి, అంగన రాయ్ లు తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు.
ఇక సినిమాకి హైలైట్స్ గా నిలిచిన వాటి గురించి చెప్పుకొస్తే మది సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా మహేష్ బాబుని చూపించిన విధానం మాత్రం అభిమానులకు, లేడీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఇక తనకి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని అద్భుతః అనే రేంజ్ లో చూపించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలు పెద్దగా లేకపోయినా పిక్చరైజేషన్ పరంగా మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఇక దేవీశ్రీ అందించిన నేపధ్య సంగీతం అస్సలు బాలేదు. చెప్పాలంటే మీకు లెజెండ్ సినిమాలో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యుజిక్కే ఇక్కడా వినిపిస్తూ ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమా ఎడిటింగ్ పై చాలా వర్కౌట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన సరిగా ఎడిట్ చేయకుండా వదిలేసిన సీన్స్ సినిమాలో బోరింగ్ గా అనిపిస్తాయి. అనల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ గా ఉన్నాయి. అక్షయ్ త్యాగి కాస్ట్యూమ్స్ అదుర్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
రెండు వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత మహేష్ బాబు అభిమానులు హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను అందుకొని కేక, బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే సినిమా కాకపోయినా వారు ఎదురు చూస్తున్న హిట్ దాహాన్ని మాత్రం తీర్చే సినిమా 'శ్రీమంతుడు'. కొరటాల శివ మహేష్ బాబు సినిమా అనగానే ఓ సోషల్ మెసేజ్ ఉన్న స్ట్రాంగ్ స్టొరీ లైన్ ని ఎంచుకున్నాడు కానీ దానిని కమర్షియల్ గా చెప్పాలనుకున్నాడు. అందులో తప్పులేదు.. కానీ మరీ అన్ని సినిమాల రెగ్యులర్ ఫార్మాట్ లో చెప్పకుండా, సరికొత్తగా కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చెయ్యాల్సింది. అలా చెయ్యకపోవడమే ఈ సినిమాకి మైనస్. అదీ కాక సినిమాలో పాత్రలని పరిచయం చేసి వాటిని ఎలివేట్ చెయ్యడానికే మొదటి అర్ధభాగం అంతా సరిపోవడం ఆడియన్స్ ని బోర్ కొడుతుంది. అలాగే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తరవాత ఆడియన్స్ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. దానికి తోడూ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా సిల్లీగా ఉంటుంది. ఫైనల్ గా మహేష్ బాబుకి కావాల్సిన హిట్ ని ఈ సినిమా అందించినా కొరటాల శివ నుంచి వచ్చిన ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే 'శ్రీమంతుడు' కాదు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Ravi
-
Srimanthudu
-
Cinema
-
Mahesh
-
mahesh babu
-
Shruti Haasan
-
Episode
-
CBN
-
Kathanam
-
koratala siva
-
Hero
-
Harshad Mehta
-
Ishtam
-
Heroine
-
Ravikanth Perepu
-
JagapathiBabu
-
jagapati babu
-
rajendra prasad
-
babu rajendra prasad
-
Mukesh
-
vennela
-
angana new
-
Maha
-
Audience
-
Kick
-
prasad
-
Music
-
Legend
-
Director
-
akshay
-
Mythri Movie Makers
-
Blockbuster hit
-
ravi anchor