నయనతార కు గట్టి పోటీ ఇస్తున్న సమంత..?
ఇటీవల నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలు పోషించిన ఓ బేబీ సినిమా విడుదలయ్యే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నటిగా తన స్థాయిని పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర రగడ సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ఓ బేబీ సినిమా కలెక్షన్లు నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ఇదిలావుండగా నయనతార చేయాల్సిన ఓ సినిమా వైపు సమంత మొగ్గు చూపుతోందట.
గతంలో తమిళంలో వచ్చిన 'అరమ్' సినిమా సీక్వెల్ లో సమంతనటించబోతుందని సమాచారం. ఈ సినిమా తెలుగులో 'కర్తవ్యం' పేరుతో రిలీజైంది. ఆ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు. మొదట నయనతారే అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ ఛాన్స్ దక్కబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద సమంత పెళ్లయిన తర్వాత లేడి ఓరియెంటెడ్ సినిమాలో నయనతారకు గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.