బతికితే పూరి జగన్నాథ లా బతకాలి షాకింగ్ కామెంట్స్ చేసిన వి వి వినాయక్..!

KSK
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న వివి వినాయక్ ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. అంతేకాకుండా చాలా మంది స్టార్ హీరోలకు మంచి హిట్ లు కూడా కెరీర్లో గుర్తుండి పోయేలా ఇచ్చారు. ముఖ్యంగా రాజకీయాల నుండి సినిమా రంగానికి వచ్చిన చిరంజీవికి ఖైదీ నెంబర్ 150 వ సినిమా తో అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందించాడు.


అయితే ఆ సినిమా రీమేక్ కావడంతో అంతగా పేరు రాలేదు. చివరిగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఇంటెలిజెంట్ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో...ప్రస్తుతం వివి వినాయక్ తన తర్వాత సినిమా బాలకృష్ణ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివి వినాయక్ ఇండస్ట్రీ గురించి తన తోటి దర్శకుల గురించి సంచలన విషయాలు చెప్పారు.


ఈ సందర్భంగా రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ సరదాగా రాజమౌళి ఇంటికి వెళితే కుటుంబసభ్యులంతా కలిసి తెగ హడావిడి చేస్తారని వాళ్లు చూపించే ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ దొరకవు అని పేర్కొన్నారు. అయితే తనకు జీవితంలో నిరాశ నిస్పృహ అనిపించినప్పుడు మొదటిగా కలుసుకునే వ్యక్తి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే.. ఫోన్ చేయగానే ముందు మీరు వచ్చేయండి మాట్లాడుకుందాం అని అంటారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా భయం, టెన్షన్ లేని వ్యక్తి పూరి అని వినాయక్ అన్నారు. బతికితే పూరి జగన్నాథ లా బతకాలని...ఒకవేళ దేవుడు మరొక జన్మ ఇస్తే పూరి జగన్నాథ్ లా జన్మించాలని కోరుకుంటా అని వినాయక్ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: