బన్ని చెప్పిన ఆ మాటతో .. ఇదెక్కడి గొడవ రా బాబూ అంటోన్న సుకుమార్
ఇదిలా ఉండగా తాజాగా తన తో చేయబోయే సినిమా విషయంలో అల్లు అర్జున్ సుకుమార్ కి ఫిట్టింగ్ పెట్టినట్లు దీంతో సుక్కు ఇదెక్కడి గొడవ రా బాబు అన్నట్టుగా ఫిలిం నగర్ నుండి వస్తున్న సమాచార. విషయం ఏమిటంటే గతంలో రంగస్థలం సినిమా తీసిన తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని ప్రకటించిన తరువాత..స్టోరీ సిద్ధం చేయడంలో చాలా సమయం సుకుమార్ తీసుకుంటున్న క్రమంలో వెంటనే మహేష్ బాబు డైరెక్టర్ సుకుమార్ సినిమా లేదు అని సోషల్ మీడియాలో ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
ఇదే క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా సుకుమార్ తో సినిమా స్టోరీ సిద్ధం చేయమని వెంటనే ఐకాన్ అనే సినిమా ప్రకటించడంతో సుకుమార్ షాక్ తిన్నారట. స్టోరీలు రాయటంలో డైరెక్టర్ సుకుమార్ ఎక్కువ సమయం తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉండటంతో అల్లు అర్జున్ ఐకాన్ అనే సినిమా ప్రకటించారని అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఈ క్రమంలో తాజాగా తనకు ఎదురవుతున్న పరిస్థితులను గమనిస్తున్న సుకుమార్ వేరే ఇతర సినిమా ఇండస్ట్రీలో స్టోరీ కోసం హీరోలు చాలా కాలం వెయిట్ చేస్తారని కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా రివర్స్ అనే కామెంట్ చేసినట్లు సమాచారం.