రంగస్థలం స్పూర్తితో అఖిల్

Seetha Sailaja
రాజమౌళి త్రివిక్రమ్ ల తరువాత డిఫరెంట్ సినిమాలకు చిరునామా సుకుమార్. 8సంవత్సరాల క్రితం ‘రంగస్థలం’ విడుదలకు ముందు ఈసినిమా విజయం సాధిస్తుందా అనే సందేహాలు అప్పట్లో చాలామందికి కలిగాయి. దర్శకుడు సుకుమార్ తనదైన రీతిలో 1980 సంవత్సరంనాటి పరిస్థితులను నేటితరానికి పరిచయం చేస్తూ ఒక ప్రయోగం చేశాడు. ఆమూవీలోని రామ్ చరణ్ బుచ్చిబాబు పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చింది.

గ్రామీణ  ప్రతీకారకధల ట్రెండ్ :-
‘రంగస్థలం’  విజయం తర్వాత గ్రామీణ నేపథ్యంలో సాగే కథలతో చాల సినిమాలు వచ్చాయి. పీరియాడిక్ కథలు చాలమటుకు సినిమాలుగా వచ్చాయి. గ్రామీణ జీవనశైలి స్థానిక రాజకీయాలు కుటుంబ సంఘర్షణలమధ్య ప్రతీకార కథలు చాల సినిమాలుగా ఆధునిక సాంకేతికత ప్రభావం లేకుండా కేవలం పాత్రల భావోద్వేగాలు కుటుంబ బంధాలు వంట అంశాలతో చాల సినిమాలు వచ్చాయి. ఈసినిమాలలో హీరో కంటే కథ ముఖ్యంగా కనిపిస్తుంది. పరక్షకులు వారికి తెలియకుండానే సినిమా నడిచే కాలంలోకి వెళ్లిపోతారు.  
ట్రెండ్ ను ఫాలో అయిన లెనిన్ :-
లేటెస్ట్ గా విడుదలైన ‘లెనిన్’ కూడ ఇదే ట్రెండ్ ను ఫాలో అయింది. 1986 కాలంలో ప్రారంభమయ్యే ఈ కథలో నేటి తరం జీవనశైలికి సంబంధించిన ఎలాంటి విషయాలు  కనిపించవు. గ్రామీణ వాతావరణం, ప్రతీకారం బలమైన భావోద్వేగాలు, స్థానిక పాత్రలతో దర్శకుడు ఇంటెన్స్ డ్రామాగా లెనిన్ రూపొందించాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మొదటిరోజు ఈసినిమా 14 కోట్లు కలక్షన్స్ రాబట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ట్రెండ్ తో చాల సినిమాలు రాబోతున్నాయా :-
త్వరలో విడుదల కాబోతున్న నాని ‘ప్యారడైజ్’ మూవీ కథ కూడ పల్లెటూర్ ట్రెండ్ ను ఫాలో కాబోతుంది. అంతేకాదు మరికొన్ని చిన్న సినిమాలు కూడ ఇలాంటి గ్రామీణ నేపధ్యంలో రాబోతున్నాయి.
విశ్లేషణ :-
‘రంగస్థలం’ మూవీ స్క్రీన్ ప్లే చాల డిఫరెంట్ గా ఉండటంతో అది ఆరోజులలో బ్లాక్ బష్టర్ హిట్. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ కథలను సినిమాలుగా తీస్తే ప్రేక్షకులు బాగా చూస్తారు అన్నది ‘లెనిన్’ విజయం తెలియచేస్తోంది. గతంలో నాగార్జున వరస ఫ్లాప్ లలో ఉన్నప్పుడు నాగార్జునకు అప్పట్లో వచ్చిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ కెరియర్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఫ్లాప్ లలో ఉన్న అఖిల్ కు రూరల్ సెంటిమెంట్ బాగా కలిసివచ్చింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: