ఘనంగా ప్రారంభమైన 'నిమ్మకాయ.. నీకెందుకు భయం' చిత్రం

Reddy P Rajasekhar

హైదరాబాద్:
 ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా,  ప్రముఖ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో, బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్‌పై, 'Eట్లు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా . విభిన్న కథా చిత్రం 'నిమ్మకాయ.. నీకెందుకు భయం' ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట సారథి స్టూడియోస్‌లో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయాగా, తొలి షాట్ కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు. పలువురు అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ, "ఈ సినిమా కథలో హారర్, థ్రిల్లర్ అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నటి ఆమనితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చిన్న నిర్మాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలి. చిన్న సినిమాలు నిలబడితేనే సినీ పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది" అని అన్నారు.

దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ, "ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. 'నిమ్మకాయ' చుట్టూ ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. కథలో ఎక్కువ భాగం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. సుమన్, ఆమనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు" అని తెలిపారు.

హీరో రాజేష్ భూపతి మాట్లాడుతూ, "ఇది నాకు తొలి చిత్రం. నిమ్మకాయను ఇప్పటికీ చాలామంది మూఢనమ్మకాలతో అనుసంధానించి చూస్తుంటారు. అలాంటి అంశాలను కొత్త కోణంలో నిజాలను చూపించే ప్రయత్నం ఈ సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు" అన్నారు.

పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, "కలియుగ వెంకటేశ్వర స్వామి పాత్రతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సుమన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. 'నిమ్మకాయ.. నీకెందుకు భయం' చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను" అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ, "మా ఆహ్వానాన్ని స్వీకరించి, చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన వినోదాన్ని అందించే మంచి చిత్రాన్ని రూపొందించేందుకు మా బృందం అంకితభావంతో పనిచేస్తుంది" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రం ఆగస్టు లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

నటినటులు :
రాజేష్ భూపతి,స్వప్నరాజ్, అబిత, ప్రముఖ నటుడు సుమన్, ఆమని, తనికెళ్ళభరణి, రవిబాబు, టార్జాన్, బెంగళూరు అవినాష్, గడ్డం నవీన్, పుష్ప జగదీష్, సుమన్ శెట్టి, జబర్దస్త్ రాజమౌళి, శాంతి, హంస,  సత్య తదితరులు.


చిత్ర విశేషాలు:
బ్యానర్: బి.వి.సి ఫిల్మ్స్
BNR చౌదరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: రోశిరెడ్డి పందిళ్లపల్లి
కో-డైరెక్టర్ : జానకి రామ్ తిరందాస్
మ్యూజిక్ : వరికుప్పల యాదగిరి
DOP: డి. యాదగిరి
ఫైట్స్: P. సతీష్
పోస్టర్ డిజైనర్: కాశీ
లిరిక్స్: చింతపల్లి విజయ్ కుమార్
డైలాగ్స్: మదన్
మేనేజర్: బలరామ్
ఆర్ట్: విజయ్ కృష్ణ
పీఆర్ఓ: అశోక్ దయ్యాల

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: