నాగిని సీరియల్ నటి విడాకులకు కారణం అదేనా..?

Divya
 బాలీవుడ్ టెలివిజన్ నటిగా మౌని రాయ్ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా నాగిని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ తో 2022లో వివాహం జరిగింది. వీరి వివాహం మలయాళ,బెంగాలీ సాంప్రదాయ పద్ధతులలో జరిగింది. కానీ వివాహమైన నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా మౌని రాయ్ పైన భారీగానే ట్రోల్స్ జరుగుతున్నాయి. మౌని రాయ్ తన భర్తతో విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం తన స్నేహితురాలైన నటి దిశా పటానినే అంటూ ట్రోల్ చేస్తున్నారు.


గత కొద్దిరోజులుగా మౌని రాయ్, సూరజ్ నంబియర్ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వదంతులు కూడా వినిపించాయి, తాజాగా ఈ విషయం పైన ఇద్దరు విడిపోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. మా వ్యక్తిగత ప్రాధాన్యతలలో మార్పు కారణంగా, తాము పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనుకున్నామని ఇలాంటి సమయంలో మా గోప్యతను గౌరవించండి అంటూ మౌని, సూరజ్ ఒక నోట్ ద్వారా తెలియజేశారు.



మౌని రాయ్, దిశా పటాని ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి పార్టీలకు ట్రిప్పులకు వెళుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మౌని రాయ్, తన భర్త సూరజ్ విడిపోవడనికి దిశా పటానినే కారణం అంటూ ఆరోపణలు చేస్తున్నారు నేటిజన్స్. దిశా పటాని స్నేహం వల్లే ఆమె అలా తయారయ్యింది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటానిపై ట్రోల్స్ జరుగుతున్న విషయాన్ని గమనించిన మౌని రాయ్ తన విడాకుల పోస్ట్ పైన వస్తున్న కామెంట్లను మ్యూట్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ విషయం పైన నేటిజన్స్ సైతం దిశా పటానికి వ్యతిరేకంగానే కామెంట్స్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఎవరు ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: