ధనుష్ కర తెలుగు టీచర్ అద్దిరిపోయింది..!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా పీరియాడిక్ డ్రామా చిత్రం కర. ఈ చిత్రం 1991 నేపథ్యంలో జరిగే కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధనుష్ రైతు పాత్రలో కనిపించబోతున్నారు. మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. తెలుగు సినిమాకి సంబంధించి టీజర్ ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.


టీజర్ విషయానికి వస్తే.. పాపమో పుణ్యమో తాను నాటింది తానే నరుక్కోవాలి, నేను నాటిన విత్తనం ఇప్పుడు కోతకి వచ్చింది. అంతకంటే ముందుగా నా మీద పడ్డ మచ్చని చెరిపేయాలి.. నన్ను నమ్ముకున్న వారిని ముందుకు తీసుకువెళ్లాలి నా పేరు కరసామి అంటూ ధనుష్ చెప్పే వాయిస్ ఓవర్ తో  టీజర్ అద్వంతం ఆసక్తికరంగా సాగింది. గ్రామంలో ఒక సమస్యను పరిష్కరించేందుకు కరసామి సిద్ధపడటం, ఈ క్రమంలోనే ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి ? అనే విషయాలను చూపించారు.


ధనుష్ పాత్రలో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి ఒకవైపు సమస్యను ఎదుర్కొనే యువకుడిగా కనిపిస్తూ మరొకవైపు ఎమోషనల్ తో కలిగిన ఒక వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రీసెంట్గా విడుదల చేసిన కర పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్ కి కూడా అలాంటి రెస్పాన్స్ లభించడంతో సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ని కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ ధనుష్ మాత్రం ఈ మధ్యకాలంలో చాలా విభిన్నంగా కథలను ఎంచుకోవడం గమనార్హం. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలలో కూడా ధనుష్ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: