హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఎంట్రీ యశ్ మూవీకి బిగ్ ట్విస్ట్!
లేటెస్ట్ గా ఈ సినిమా సెట్స్ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ (JJ Perry), ‘టాక్సిక్’ సెట్స్ లో ప్రత్యక్షమయ్యారు. ఈయన ఎవరో కాదు.. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ సినిమాలకు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అందించిన మేధావి. ఇప్పుడు యశ్ తో కలిసి జెజె పెర్రీ పనిచేస్తుండటంతో, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు.జెజె పెర్రీ స్వయంగా యశ్, గీతూ మోహన్ దాస్ లతో ఉన్న బిహైండ్ ద సీన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై దర్శకురాలు స్పందిస్తూ.. "ఈ కాంబినేషన్ ఫ్రేమ్ లో మామూలుగా ఉండదు" అని క్రేజీ కామెంట్ చేశారు. దీనిని బట్టి చూస్తే, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్సివ్ గా, భారీ బ్లాస్ట్ లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయని అర్థమవుతోంది. జెజె పెర్రీ మేకింగ్ స్టైల్ యశ్ బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
పోర్చుగీసు పాలనలో గోవాలో సాగే రాజకీయ పరిణామాలు, రక్తపాతంతో కూడిన గ్యాంగ్ వార్స్ ఈ కథలో హైలెట్. ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని ఒక వేదికపై ఈ సినిమాకు సంబంధించిన 9 నిమిషాల ప్రివ్యూను ప్రదర్శించి హాలీవుడ్ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తుండటంతో ఇక్కడ కూడా రికార్డు ఓపెనింగ్స్ రావడం ఖాయం. యశ్ పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్ పై వేసిన ఈ గురి ఎంతవరకు చేరుతుందో చూడాలి!