జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్..చిరంజీవి చిత్రంలో విలన్ గా హాట్ లేడీ..!?
ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశాల్లో ఒకటి పవర్‌ఫుల్ లేడీ విలన్ పాత్ర. ఈ పాత్ర కోసం యువ నటి డింపుల్ హయాతిను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆమె తెలుగు, తమిళం సహా పలు భాషల్లో దాదాపు 11 సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో విజయం మాత్రం దక్కలేదు. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కనిపించినా, ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.అయితే ఇలాంటి సమయంలోనే ఆమెకు చిరంజీవి వంటి మెగాస్టార్ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం నిజంగా కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. విలన్ పాత్ర అయినప్పటికీ, అది బలమైనది, కథలో కీలకంగా ఉండేలా రూపొందిస్తే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా హీరోతో సమానంగా నిలిచే ప్రతినాయక పాత్ర అయితే, నటిగా ఆమె సామర్థ్యాన్ని ప్రదర్శించుకునే మంచి వేదిక అవుతుంది.
ఈ సినిమా ద్వారా డింపుల్ హయతి తనలోని కొత్త కోణాన్ని చూపించి, ప్రేక్షకులను మెప్పిస్తే, ఆమె కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు హీరోయిన్‌గా ఆశించిన విజయాలు అందుకోలేకపోయినా, ఈ విలన్ పాత్ర ఆమెకు భారీ బ్రేక్ ఇవ్వగలదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న స్టార్ క్యాస్ట్, ఆసక్తికరమైన కథ, కొత్త తరహా పాత్రలు అన్ని కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.