ఓ చిన్న రాములమ్మ పాటకు ఆదాయం ఎంత వచ్చిందో తెలుసా..?
ఈ పాటతో వచ్చిన ఫేమ్ వల్ల బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లభించింది. అయితే హౌస్ లో కేవలం కొద్ది వారాలు మాత్రమే ఉండి , 11 వారాల తర్వాత సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. తన ఫోక్ సాంగ్స్ తో అలరించిన రాము రాథోడ్ ఓ చిన్న రాములమ్మ పాట కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టింది. ఈ పాట ద్వారా కూడా రాము రాథోడ్ తన కెరీర్ కు ఉపయోగపడింది. మారుమూల గ్రామం నుంచి వచ్చిన రాము రాథోడ్ తన ప్రతిభను నమ్ముకుని ప్రస్తుతం పెద్ద వేదికల పైన కూడా రాణిస్తున్నారు. ఓ చిన్న రాములమ్మ సాంగ్ సక్సెస్ తర్వాత తెలంగాణ రచయిత అందె శ్రీ స్వయంగా కాల్ చేసి మరి ప్రశంసలు కురిపించారట.
రాను బొంబాయికి రాను అంటే పాటలో యూట్యూబ్లో వందల కొద్ది మిలియన్స్ న్యూస్ తో దూసుకుపోతూ ఉండడంతో కేవలం యూట్యూబ్ యాడ్స్ ద్వారానే కోటి రూపాయల వరకు వీరికి వచ్చాయని సమాచారం. అలాగే ఓ చిన్న రాములమ్మ పాట కేవలం లక్ష రూపాయలతో తెరకెక్కించగా సుమారుగా రూ.20 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు రాము రాథోడ్.