పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన టీమ్..!

Divya
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తన నెక్స్ట్ ప్రాజెక్టులు ఇవే అంటూ కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే వాటన్నిటి పై పవన్ కళ్యాణ్ టీమ్ స్పందించింది. పవన్ కళ్యాణ్ టీమ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్టులకు సంతకం చేయలేదని ప్రస్తుతం ఆయన కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యారని కొత్తగా ఏవైనా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలలో నిజం లేదని కొట్టిపారేసింది.


ఆయన కొత్త సినిమాలు ప్రారంభించే ఆలోచన ఇప్పట్లో లేదని ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం అది అధికారికంగా ప్రకటిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటివరకు వచ్చిన అనవసరమైన ప్రచారాలను ఎవరు నమ్మవద్దని సూచించారు టీమ్. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజి సీక్రెట్ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ విషయాలు ఏవైనా ఉంటే నేరుగా పవన్ కళ్యాణ్ గారి సరైన సమయంలో ప్రకటిస్తారని తెలియజేశారు.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టారని రాష్ట్ర అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది సినిమా షూటింగుల కంటే ప్రజాక్షేత్రంలో ఉండడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే మెగా అభిమానులు జనసైనికులు తమ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఎలాంటి విషయాలను నమ్మవద్దు అంటు తెలియజేశారు. మార్చి 19వ తేదీన ఉగాది పండుగ కానుకగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. దురంధ 2 సినిమా వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కు కలెక్షన్స్ తగ్గిపోయాయి అనే విధంగా పలువురు నెటిజెన్స్  కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: