దురంధర్ 3 పై.. డైరెక్టర్ ఆదిత్యధర్ పోస్ట్ వైరల్..!

Divya
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైడెడ్ యాక్షన్ త్రిల్లర్ చిత్రం దురధర్: ది రివేంజ్. సంచలన డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత ఏడాది విడుదలైన దురేందర్ సీక్వెల్ కి ఈరోజు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ ఆదిత్యధర్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ఒక నోట్ ద్వారా విన్నపం చేశారు.


ఈ సినిమాలోని ట్విస్టులు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ రివిల్ చేయవద్దని, స్పెయిలర్స్ ఇవ్వకుండా ప్రేక్షకులు ఉత్సాహాన్ని దెబ్బతీయొద్దు అంటూ కోరారు. అలాగే ఈ సినిమా ఎండ్ కార్డు పడే వరకు సిట్ లో నుంచి ఎవరు పైకి లేవద్దని సలహా ఇచ్చారు. దీంతో దురంధర్ 3 కూడా ఉండే అవకాశం ఉందని ఊహాగానాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కూడా భారీగానే రాబట్టినట్లు వినిపిస్తున్నాయి. మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయో చూడాలి.


దురంధర్ మొదటి భాగం హిందీలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం వంటి భాషలలో ఒకేసారి విడుదల చేశారు. రణవీర్ సింగ్  ఏజెంట్ పాత్రలో అద్భుతంగా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సార తదితర భారీతారాగణం ఈ సినిమాలు భాగమయ్యారు.. ఇది కొత్త భారత్ ఇంట్లోకి చొరబడి మరి కొడుతోంది అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేశారు. మా సినిమా నిడివి కూడా ప్రేక్షకులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 3 గంటల 49 నిమిషాలు అంటే (229నిమిషాలు) సుదీర్ఘ నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో ఉండే ఇంటెన్స్ యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు కారణంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సంగీతాన్ని అందించిన శాశ్వత సచ్ దేవ్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: