ట్విస్ట్:ఉస్తాద్ భగత్ సింగ్‌లో మరో సర్‌ప్రైజ్.. థియేటర్లలో ఆ సాంగ్ ఉండదా?

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ కాంబినేషన్ అంటేనే రికార్డులు తిరగరాయడానికి సిద్ధంగా ఉండాలి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఈ ఏడాది ఉగాది కానుకగా మార్చి 19న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది.



సినిమా ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన సాంగ్స్ కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎంతో హైప్ ఇచ్చి రిలీజ్ చేసిన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ (Aura of Ustaad) సాంగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ సాంగ్ ఎంత మందికి నచ్చిందో, అంతే స్థాయిలో కొందరికి సరిగ్గా ఎక్కలేదు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏంటంటే.. ఈ పాట అసలు థియేటర్ వెర్షన్‌లో ఉండబోదట!ఈ పాటను కేవలం పవర్ స్టార్ మేనరిజమ్స్ మరియు సినిమా హైప్‌ను పెంచడానికి ప్రమోషనల్ కంటెంట్‌గా మాత్రమే వాడారని, మెయిన్ మూవీలో ఇది కనిపించదని సమాచారం. ఇది విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా సర్ప్రైజ్ అవుతున్నారు.



ఈ సినిమాకు సంగీత పరంగా ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది.పవన్ కళ్యాణ్ - డీఎస్పీ కాంబో అంటేనే మ్యూజికల్ చార్ట్ బస్టర్స్. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ లోనే అదిరిపోయే మాస్ సాంగ్స్ మరియు మెలోడీలను దేవిశ్రీ అందించారు.ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) మన థమన్ ఎస్ అందిస్తున్నారు. పవర్ స్టార్ ఎలివేషన్లకు థమన్ ఇచ్చే సౌండ్ బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెప్పించడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరియు అందాల భామ రాశి ఖన్నా నటిస్తున్నారు.మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా, ఉగాది పండుగకు ముందే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెప్పించబోతోంది. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ తోడైతే రికార్డులన్నీ బద్దలే!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: