విజయ్
దళపతి ప్రస్తుతం
కోలీవుడ్ లో ఈ పేరు తెగ ట్రెండింగ్ లో ఉంది ఓ పక్క తమిళనాడు అసెంబ్లీలో ఎలాగైనా గెలవాలని
విజయ్ దళపతి పోరాటం చేస్తుంటే మరోపక్క ఆయన
భార్య ఇచ్చిన షాక్ మాత్రం మామూలుగా లేదు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న
సంగీత కరెక్ట్ గా తమిళనాడు ఎలక్షన్స్ సమయంలోనే
విజయ్ ని గట్టి దెబ్బ కొట్టింది.
విజయ్ కి విడాకులు ఇస్తున్నట్టు చెంగల్పట్టు లోని ఫ్యామిలీ కోర్టులో తెలిపింది. ఫ్యామిలీ కోర్టులో తన భర్తతో తనకు విడాకులు కావాలని తన
భర్త చాలా రోజుల నుండి ఒక నటితో అక్రమ సంబంధం లో ఉన్నారని ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఆయనకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ పిటిషన్ దాఖలు చేసింది.దీనితో ఒక్కసారిగా
విజయ్ విడాకుల వ్యవహారం కోలీవుడ్లో సంచలనం సృష్టించింది.
అయితే ఈ విషయం ఇలా ఉంటే
విజయ్ ఎఫైర్ పెట్టుకున్న ఆ నటి అంటే ఎవరో కాదు త్రిషనే అంటూ ప్రచారం జరిగింది. ఇక
విజయ్ విడాకులకు కారణం త్రిషనే అనే ప్రచారం జరుగుతున్న వేళ చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో
విజయ్ త్రిష ఇద్దరు కలిసి పాల్గొనడం సంచలనంగా మారింది.
త్రిష వల్లే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం జరిగినా కూడా ఏమాత్రం భయపడకుండా
త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఎంతో ధైర్యంగా తిరుగుతున్నారు అంటూ చాలామంది వారిని విమర్శించారు. అయితే
భార్య విడాకులు కోరుతూ ఇచ్చిన రీజన్ కి
విజయ్ ప్రతీకారం తీర్చుకోవడానికి త్రిషతో పెళ్లికి హాజరైనట్టు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే
భర్త చేసిన పనికి
సంగీత ఊరుకుంటుందా ఆమె కూడా
విజయ్ కి మరో షాక్ ఇచ్చింది.
అదేంటంటే..నేను నా భర్తతోనే కలిసి ఉంటాను అంటూ
సంగీత ఇచ్చిన పిటిషన్ కి చాలామంది షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ లో ఏముందంటే.. విడాకుల వ్యవహారం ముగిసే వరకు నేను
విజయ్ ఇంట్లోనే ఉండేందుకు నాకు అనుమతి ఇవ్వగలరని కోరుతున్నాను.. ఎందుకంటే
చెన్నై లోని నీలంకరైలో ఉండే ఇంట్లో నాకు కూడా సగం వాటా ఉంది.. ఈ విడాకుల కేసు పూర్తయ్యే వరకు అలాగే నేను వేరే ఇంటికి మారేవరకు ఆ ఇంట్లో ఉండేందుకు నాకు అనుమతి ఇప్పించగలరని కోరుతున్నాను అంటూ
సంగీత తన పిటిషన్ లో పేర్కొంది. దీంతో చాలామంది షాక్ లో మునిగిపోయారు. మరి కొంత మంది ఒక ఇంట్లో ఉండి ఒకసారి పిల్లల గురించి ఆలోచించి విడాకుల్ని వెనక్కి తీసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.