దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఈ పేరు వినగానే చాలామంది అభిమానుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చిన్న ఏజ్ లోనే మరణించడం బాధాకరం. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొత్తలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా క్రేస్ సంపాదించుకున్నారు.చిత్రం, మనసంతా నువ్వే,నువ్వు నేను వంటి సినిమాలు ఈయన కెరియర్లో మైలురాయిగా నిలిచాయి. అయితే అలాంటి ఉదయ్ కిరణ్ నటించిన ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలడంతో ఆయన కెరియర్ ఇరుకున పడింది. ముఖ్యంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో పెళ్లి పీటల వరకు వెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత విషితను పెళ్లి చేసుకుని కొద్దిరోజులు హ్యాపీగా ఉన్న ఉదయ్ కిరణ్ ఎవరూ ఊహించిన విధంగా సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్ చేసుకోవడానికి కారణం కొంతమందేమో సినీ కెరియర్ అంటారు.
ఒక్కసారిగా హిట్స్ చూసిన ఉదయ్ కిరణ్ కి ఆ తర్వాత వచ్చిన ఫ్లాప్ లన్ని చీకట్లోకి నెట్టేయడంతో పాటు ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఉదయ్ కిరణ్ మనస్థాపం చెంది సూసైడ్ చేసుకున్నారు అని అంటారు. ఈ విషయం పక్కన పెడితే ఉదయ్ కిరణ్ తో పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు సుస్మిత ఒక్క మాట కూడా స్పందించలేదు. కానీ గతంలో వీరిద్దరి పెళ్లి నిశ్చమైన సమయంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన పేపర్ కట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మొదట ఉదయ్ కిరణ్ తో పెళ్లి అనగానే సుస్మిత రియాక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయ్ కిరణ్, సుస్మితల పెళ్లి నిశ్చయమయ్యాక ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.అందులో ఉదయ్ కిరణ్ ని యాంకర్ సుస్మితతో పెళ్లి అనగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని అడగగా.. సుస్మితతో నాకు మొదట ఎలాంటి పరిచయం లేదు. వ్యక్తిగతంగా పరిచయం లేకపోవడం కారణంగా మొదటి పెళ్లి ప్రస్తావన రావడంతోనే కాస్త సిగ్గుపడ్డాను.ఆ తర్వాత ఇద్దరం ఒకరికొకరం మాట్లాడుకొని అభిప్రాయాలు కలిసాకే పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇక మొదటిసారి ఎక్కువగా మాట్లాడక పోయినప్పటికీ రెండోసారి కలిసినప్పుడు ఒకరి అభిప్రాయాలు మరొకరం తెలుసుకున్నాం అంటూ ఉదయ్ కిరణ్ సమాధానం ఇచ్చారు.
ఆ తర్వాత పెళ్లి అనగానే మీ మొదటి స్పందన ఏంటి అని సుస్మిత ని అడగగా.. అప్పట్లో నేను లండన్లో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్నాను.నాకు ఆ టైంలో పెళ్లి మీద అసలు ఆలోచన లేదు. కానీ అదే సమయంలో మా అమ్మ లండన్ కి వచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. అబ్బాయిని చూసాం అని చెప్పడంతోనే మొదట షాక్ అయిపోయాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి చిన్నప్పటినుండి ఎంతో మంచి లైఫ్ ఇచ్చిన నా పేరెంట్స్ పెళ్లి విషయంలో కూడా నాకు కరెక్ట్ అబ్బాయిని చూస్తారు. వాళ్ల సెలక్షన్ లో పొరపాటు ఉండదు అని ఒప్పుకున్నాను. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరికీ ఉదయ్ కిరణ్ బాగా నచ్చేసాడు.కానీ పర్సనల్గా ఉదయ్ కిరణ్ ని కలిసి మాట్లాడి ఇష్టపడ్డాకే ఓకే చెప్పాను అంటూ సుస్మిత చెప్పుకొచ్చింది. అలా సుస్మిత ఉదయ్ కిరణ్ ల పెళ్లి ఫిక్స్ అయ్యాక మొదటిసారి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కి సంబంధించిన పేపర్ కట్ తాజాగా నెట్టింట వైరల్ అవ్వడంతో మరోసారి వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.