అనారోగ్య సమస్యలపై.. మమ్ముట్టి మొదటి రియాక్షన్..!

Divya
మలయాళ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా పేరు సంపాదించిన మమ్ముట్టి ఎప్పుడు విభిన్నమైన కథలను సెలెక్ట్ చేస్తూ ప్రత్యేక పాత్రలకు ఓకే చెబుతుంటారు. అందుకే మమ్ముట్టి సినిమాలు అన్ని భాషలలో సక్సెస్ అవుతుంటాయి. అలాగే హెల్త్ పరంగా కూడా స్టార్ హీరోలు సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి మరి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మమ్ముట్టి కూడా గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.



ఇంటర్వ్యూలో మమ్ముట్టి మాట్లాడుతూ.. మనిషికి కంటిచూపు వినికిడి చాలా ముఖ్యమని.. అలాగే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. తాను ఈ అనారోగ్యంతో చాలా రోజులు ఇబ్బంది ఎదుర్కొన్నానని తెలిపారు.వాసన, రుచి వంటి వాటిని కొద్దిరోజుల పాటు కోల్పోయానని తెలియజేశారు. తాను చాలా కాలం పాటు వీటిని కోల్పోవడంతో వాటి విలువ మనకి అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తెలుసుకోగలుగుతున్నానంటూ తెలియజేశారు. గత ఏడాది జూన్ లో మమ్ముట్టి అనారోగ్యానికి గురైనట్లుగా వినిపించాయి. అయితే మమ్ముట్టికి ఆ సమయంలో ఏమయింది? అనే విషయాన్ని మాత్రం ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.


ఇలా అనారోగ్య సమస్యల వల్ల నాలుగు నెలల పాటు సినిమా షూటింగ్ కూడా బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకొని తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మహేష్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు మమ్ముట్టి. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తున్నారు. మమ్ముట్టి కెరియర్ విషయానికి వస్తే.. 1951 సెప్టెంబర్ 7వ తేదీన కేరళలో చండీరూర్ లో జన్మించారు. ఎల్.ఎల్.బి డిగ్రీ చదివి రెండు ఏళ్ల పాటు న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. అనంతరం 1971లో అనుభవంగల్ పాలిచాకల్  సినిమాలో చిన్న పాత్రల నటించారు. ఆ తర్వాత స్వప్నంగల్ చిత్రంతో హీరోగా మారి 400కు పైగా చిత్రాలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: