టాలీవుడ్: రెమ్యూనరేషన్ పెంచేసిన వెంకీ మామ.. ఎన్ని కొట్లో తెలుసా..?
ఇదంతా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం అవడం , మార్కెట్ పరంగా కూడా ఒక్కసారిగా వెంకటేష్ క్రేజ్ పెరిగిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇటీవలే చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో కూడా గెస్ట్ అపీరియన్స్ పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో , మరోసారి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే విక్టరీ వెంకటేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా అంతే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు.
వెంకటేష్ కెరియర్ విషయానికి వస్తే తన సినిమాల విషయంలో అటు మాస్ క్లాస్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్ పరంగా నిలబెట్టుకున్న హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా వెంకటేష్ సినిమా కథ కంటెంట్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కొత్త దర్శకులకు ఎప్పుడు సరికొత్త అవకాశాలను ఇస్తూ ఉన్న వెంకటేష్ రెమ్యూనిరేషన్ పరంగా ఇప్పుడు టాప్ హీరోలకు దీటుగానే తన రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కాబట్టి కానీ ప్రస్తుతం వెంకటేష్ ఒక్కో చిత్రానికి రూ .20 నుంచి రూ .25 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్నారు.