ప్రభాస్ సినిమాలో మెగాస్టార్..నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే..?
ఇటువంటి తరుణంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నారట. ఇందులో ప్రభాస్ కు తండ్రి పాత్రలో 15 నిమిషాల పాటు కనిపించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది కనుక నిజమైతే మాత్రం అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పవచ్చు. స్పిరిట్ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా చిరంజీవి చేతుల మీదుగానే జరిగాయి. అప్పటినుంచి స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించబోతున్నారనే రూమర్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తూ ఉంటే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తారనేది నిజమనిపిస్తోందని పలువురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ మెగాస్టార్, రెబల్ స్టార్ ఓకే ఫ్రేమ్ లో కనిపించడం అంటే అది ఫ్యాన్స్ కి ఇచ్చే కిక్కే వేరే అని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా చిత్ర బృందం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. స్పిరిట్ సినిమా కి సంబంధించి విడుదలైన పోస్టర్తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 2026ఏడాది మార్చి5 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం రాజా సాబ్ మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. దీంతో అభిమానులు మొత్తం స్పిరిట్ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు.