వెట్రిమోరన్ సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..?

Divya
టాలీవుడ్, కోలీవుడ్లో హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సమంత , రెండవ పెళ్లి అనంతరం ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే వచ్చిన ప్రాజెక్టులలో తనకు బాగా ఇష్టమైన కథలను మాత్రమే ఎంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి పవర్ ఫుల్ ఉమెన్ గా ప్రేక్షకుల ముందుకే రాబోతోంది. ఇటువంటి సందర్భంలోనే సమంత తదుపరి సినిమాకి సంబంధించి కోలీవుడ్లో చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తున్నాయి.


తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించిన శింబు, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి చిత్రం అరసన్. ఈ చిత్రం పైన ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడేలా చేశారు డైరెక్టర్. ఈ చిత్రం వెట్రి మారన్ కల్ట్ క్లాసికల్ సినిమా అయినా వడ చెన్నై చిత్రానికి సంబంధించిన ప్రపంచంలో సాగేటువంటి కథ అన్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ధ్రువీకరించారు. మధురై ప్రాంతానికి చెందిన ఒక కబడ్డీ ప్లేయర్ చెన్నైకి వచ్చి డాన్ గా ఎలా మారారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రానికి సంబంధించి యాక్షన్ డ్రామా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే మేకర్స్  ఇటీవల సమంతతో చర్చలు జరిపినట్లుగా వినిపిస్తోంది. సమంత కూడా డైరెక్టర్ వేట్రి మారన్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ సినిమాలోని పాత్ర ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ అన్ని నచ్చి ఈ సినిమాలో నటించడానికి సమంత ఒకే చెబితే, శింబు, సమంత కాంబినేషన్లో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి సమంత సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనే విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: