ఆ విషయంలో సంచలనం సృష్టించిన అనగనగా ఒక రాజు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును అత్యంత తక్కువ సమయంలో సంపాదించుకున్న వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన తాజాగా అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను ఇప్పటికే వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవడం మాత్రమే కాకుండా భారీ లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ బుక్ మై షో మరియు డిస్టిక్ ఆప్ లలో అద్భుతమైన సేల్స్ ను కూడా సొంతం చేసుకుంది.
 


తాజాగా ఈ మూవీ బృందం వారు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్లు బుక్ మై షో మరియు డిస్టిక్ ఆప్ లలో సేల్ అయ్యాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఇప్పటి వరకు అనగనగా ఒక రాజు సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో మరియు డిస్టిక్ ఆప్ లలో కలిపి 1.5 మిలియన్ సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల పాటు కూడా మంచి కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: