అప్పుడు చిరు.. ఇప్పుడు చరణ్.. కానీ ఆ విషయంలో ఫుల్ టెన్షన్ పడుతున్న మెగా ఫ్యాన్స్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం క్రితం విశ్వంభర అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ ని స్టార్ట్ చేసిన తర్వాత ఈ సినిమాను 2025 సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా కావడంతో ఆ తేదీన చిరంజీవి తనయుడు అయినటువంటి రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాను విడుదల చేశారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన గేమ్ చెంజర్ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు.


ఈ సినిమా షూటింగ్ చాలా పెండింగ్ ఉండడం , ఈ సినిమా విడుదల తేదీ దగ్గరకు రావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాను మే 1 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మార్చి 26 వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి "విశ్వంభర" సినిమా విడుదల వాయిదా పడడంతో ఆ తేదీన గేమ్ చెంజర్ మూవీ విడుదల అయ్యి ఫ్లాప్ కావడంతో పెద్ది సినిమా విడుదల తేదీకి ఒక రోజు ముందు రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందా అని మెగా ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: