మహానటి ఇంట్లో అడుగుపెడితే షాక్! భర్తతో కలిసి కీర్తి సురేష్ హోం టూర్...!

Amruth kumar
టాలీవుడ్ 'మహానటి' కీర్తి సురేష్ ఇప్పుడొక ఇంటిదైంది. కేవలం పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడమే కాదు, తన కలల సౌధాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుంది. తన భర్త ఆంటోనీ తటిల్‌తో కలిసి కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన 'హోమ్ టూర్' వీడియోను ఏషియన్ పెయింట్స్ 'వేర్ ద హార్ట్ ఈజ్' (Season 9) సిరీస్ ద్వారా పంచుకుంది. కేవలం భవనం అంటే గోడలు మాత్రమే కాదు, అది జ్ఞాపకాల భాండాగారమని నిరూపించేలా ఉన్న ఈ 'హౌస్ ఆఫ్ ఫన్'కీర్తి సురేష్ అంటేనే పద్ధతి, అందం, అభినయం. ఆమె ఇల్లు కూడా అచ్చం తనలాగే అత్యంత కళాత్మకంగా, రంగురంగుల కలబోతలా ఉంది. కొచ్చిలో తన భర్త ఆంటోనీతో కలిసి ఉంటున్న ఈ అపార్ట్‌మెంట్‌ను కీర్తి "హౌస్ ఆఫ్ ఫన్" అని పిలుచుకుంటుంది. తాజాగా విడుదలైన ఈ హోమ్ టూర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.



కీర్తి తన ఇంటికి ఎంచుకున్న రంగులు ఆమె అభిరుచిని చాటిచెబుతున్నాయి.ప్రేమతో నిండిన వంటగది: ఈ ఇంట్లోని ఓపెన్ కిచెన్ 'మింగ్ జేడ్' (ఆకుపచ్చ) రంగులో మెరిసిపోతోంది. అక్కడ ఒక చిన్న బోర్డుపై “This kitchen is seasoned with LOVE” అని రాసి ఉండటం విశేషం.వంటగది పక్కనే ఉన్న డైనింగ్ ఏరియాను ఒక చిన్న కెఫేలా డిజైన్ చేశారు. అక్కడ తన పెళ్లికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను గోడలకు అలంకరించారు.సినిమా రంగంలో కీర్తి సురేష్ స్థాయిని మార్చేసిన సినిమా 'మహానటి'. తన ఇంటి లివింగ్ ఏరియాలో ఆ సినిమాకు సంబంధించి తనకు వచ్చిన నేషనల్ అవార్డ్ ఫోటోలను, సావిత్రి గారికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్‌ను భద్రంగా ఒక ఫ్రేమ్‌లో పొందుపరిచారు. తన కెరీర్‌లో ఈ మూమెంట్ తనకు ఎప్పటికీ స్పెషల్ అని కీర్తి ఈ వీడియోలో ఎమోషనల్ అయ్యారు.



ఇంటి మొత్తంలో కీర్తి మరియు ఆంటోనీలకు అత్యంత ఇష్టమైన ప్రదేశం వాళ్ల ఇంటి టెర్రస్ బార్. ఈ బార్ కౌంటర్ మీద వందలాది ఫోటోలను అమర్చి, దానిపై రెసిన్ కోటింగ్ వేశారు. అంటే ఆ టేబుల్ చూస్తుంటే వారి 15 ఏళ్ల ప్రేమ ప్రయాణమంతా కళ్లముందు కదలాడుతుంది.అక్కడే ఒక బోర్డు మీద “Nobody gets out sober” అని రాసి ఉండటం చూసి కీర్తి నవ్వుతూ, "ఇక్కడి వ్యూ చూస్తే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే" అని చమత్కరించారు.కీర్తికి తన పెంపుడు కుక్క నైక్ (Nyke) అంటే ప్రాణం. ఈ ఇంట్లో నైక్ కోసం కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్‌ను కేటాయించారు. అపార్ట్‌మెంట్ చుట్టూ ఉన్న గాలరీలో మొక్కలతో ప్రకృతిని ఇంటి లోపలికి తెచ్చారు.



ఈ హోమ్ టూర్ వీడియోలో కీర్తి తన భర్త ఆంటోనీని పరిచయం చేస్తూ చాలా సంతోషంగా కనిపించారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే ప్రేమలో ఉన్నారని, దాదాపు 15 ఏళ్ల తర్వాత వివాహం చేసుకున్నారని మనకు తెలిసిందే. వారిద్దరి అభిరుచులు కలిసి ఈ ఇంటిని ఒక స్వర్గంలా మార్చాయి.మొత్తానికి కీర్తి సురేష్ తన 'హౌస్ ఆఫ్ ఫన్' ద్వారా తన పర్సనల్ లైఫ్ లోని అందమైన కోణాన్ని అభిమానులకు చూపించారు. లగ్జరీ కంటే కూడా అనుబంధాలకు, జ్ఞాపకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ ఇంటిని నిర్మించుకున్న తీరు అద్భుతం. బాక్సాఫీస్ దగ్గర 'మహానటి'గా రికార్డులు కొట్టిన కీర్తి, ఇప్పుడు గృహిణిగా కూడా తన ఇంటిని ఒక కళాఖండంలా తీర్చిదిద్దుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: