Ntr:ఆగిపోయిన డ్రాగన్ మూవీ షూటింగ్.. కారణం ఏమిటంటే..?

Divya
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. ఎన్టీఆర్ కి జోడిగా మొదటిసారి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే ఇందులో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, మరో నటుడు బీజు మీనన్ అని కూడా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ వారు భారీ బడ్జెట్లోనే నిర్మిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్లీ తిరిగి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీంతో పగలు రాత్రి అని తేడా లేకుండా హైదరాబాద్ షెడ్యూల్ బిజీగా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది.



తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొద్దిరోజుల నుంచి జలుబు, తలనొప్పితో  చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ ఆరోగ్య సమస్య రోజురోజుకి పెద్దది కావడంతో ఎన్టీఆర్ కి అలసటగా మారడంతో పూర్తి విశ్రాంతి కొద్ది రోజులు తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో సినిమా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో అనుకోని కారణాల చేత ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మరొకసారి బ్రేక్ పడింది.


కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇది కేవలం రెండు మూడు రోజులు బ్రేక్ మాత్రమేనని ఆ తర్వాత తిరిగి సినిమా షూటింగ్ ని ప్రారంభించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. వాస్తవంగా డ్రాగన్ సినిమాని 2026లోనే విడుదల చేయాలని చూసినప్పటికీ సినిమా షూటింగ్ ఆలస్యం  కావడం చేత వచ్చే ఏడాదికి(2027) పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేస్తారా? లేకపోతే సమ్మర్లో విడుదల చేస్తారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ చాలా స్లిమ్ముగా మారారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: