సైలెన్స్ బ్రేక్..! తమన్నా మాటలతో ఫిల్మ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్...!
అయితే ఆ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, ఇప్పుడు తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని తమన్నా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'ఓదెల 2' వంటి సినిమాల గురించి మాట్లాడుతూ.. "జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం ఇది. కాశీలో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంలో ఏదో మ్యాజిక్ ఉందనే భావన కలిగింది" అని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు దర్శకుల ఒత్తిడికి తలొగ్గిన తాను, ఇప్పుడు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నానని ఆమె చెప్పారు.తమన్నా చేసిన ఈ కామెంట్స్ విన్నాక, ఆమెకు మద్దతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "తమన్నా లాంటి స్టార్ హీరోయిన్‌కే ఇలాంటి అనుభవం ఎదురైతే, సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. ఆ ఒత్తిడి చేసిన డైరెక్టర్ ఎవరై ఉంటారా? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. గతంలో తమన్నా నటించిన సినిమాల లిస్టును బయటకు తీసి మరీ ఆరా తీస్తున్నారు.
'హ్యాపీడేస్'తో మొదలైన తమన్నా ప్రస్థానం 'బాహుబలి' వరకు ఒక రేంజ్ లో సాగింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలన్ పాత్రల్లో ('మ్యాస్ట్రో') కూడా మెప్పించిన తమన్నా, ఇప్పుడు ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. "ఎవరో ఒకరు నాపై ఒత్తిడి తెస్తే లొంగిపోయే స్టేజ్ దాటిపోయాను. ఇప్పుడు నా ప్రతిభే నాకు పని ఇస్తుంది" అని తమన్నా చెప్పిన మాటలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చాటి చెబుతున్నాయి.మొత్తానికి తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని చీకటి కోణాలను మరోసారి ఎత్తిచూపాయి. ఎంత స్టార్ డమ్ ఉన్నా, కెరీర్ ఆరంభంలో ఎదురైన గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటాయని తమన్నా మాటల్లో అర్థమవుతోంది. ధైర్యంగా బయటకు వచ్చి నిజాలు చెప్పిన తమన్నాను ఫ్యాన్స్ "రియల్ స్టార్" అంటూ కొనియాడుతున్నారు.