సంక్రాంతి పండగ వచ్చింది అంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంక్రాంతి సమయంలో సినిమాలను చూడడానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ వస్తారు. దానితో సంక్రాంతి సమయంలో విడుదల అయిన సినిమాలలో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రవితేజ కూడా తన కెరియర్లో చాలా సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశాడు. ఇక రవితేజ ఇప్పటివరకు సోలో హీరోగా నటించి సంక్రాంతికి విడుదల అయిన సినిమాలలో దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
మొదటి సారి రవితేజ నటించిన కృష్ణ సినిమా 2008 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2011 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ హీరో గా రూపొందిన మిరపకాయ్ సినిమా విడుదల అయింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2021 వ సంవత్సరం రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజాగా 2026 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల అయింది. ఈ మూవీ నిన్న అనగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ.కి కూడా మంచి టాక్ జనాల నుండి వచ్చింది. దానితో ఈ సినిమాతో కూడా రవితేజ మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇలా రవితేజ తన కెరీర్ ల నాలుగో సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తే అందులో ఇప్పటికే మూడు విజయాలను అందుకున్నాయి. తాజాగా విడుదల అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకి కూడా మంచి టాక్ రావడంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని రవితేజ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.