మన శంకర వరప్రసాద్ గారు: ఓ పక్క చెత్త ట్రోలింగ్..మరొక పక్క వంద కోట్ల వ్యూస్..ఎలా బ్రో..?
‘మీసాల పిల్ల’ – ఇన్స్టంట్ చార్ట్ బస్టర్!
సినిమా నుండి విడుదలైన మొదటి సింగిల్ సాంగ్ ‘మీసాల పిల్ల’ నిజంగానే బ్లాస్టింగ్ రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్స్లో టాప్‌లో నిలిచింది.ఇప్పటివరకు 80 మిలియన్ ప్లస్ వ్యూస్ సోషల్ మీడియాలో వేలాది రియాక్షన్ రీల్స్ . స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో టాప్ పోజిషన్లు. ఈ సంఖ్యలను చూసి మూవీ యూనిట్ కూడా సూపర్ జోష్‌లో ఉంది.
రెండో సింగిల్ ‘శశిరేఖ’ కూడా సాలిడ్ బ్లాక్‌బస్టర్!
ఇటీవల విడుదలైన రెండో సింగిల్ ‘శశిరేఖ’ సాంగ్ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రిలీజ్ అయ్యి తక్కువ టైమ్‌లోనే ఈ సాంగ్ 20 మిలియన్ల మార్క్‌ను క్రాస్ చేయడం విశేషం. ప్రస్తుతం కూడా ఈ సాంగ్ స్టెడీగా వ్యూస్ పెంచుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ రెండు పాటలతో కలిపి సినిమా మొత్తం ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ప్రమోషన్స్ దశలో ఒక సినిమాకు ఇంత భారీ మ్యూజిక్ వ్యూస్ వచ్చేయడం నిజంగా అరుదైన విషయం.
"ముందు ట్రోల్ – తర్వాత అప్రిషియేషన్": ఈ సినిమాకి స్పెషల్ ప్యాటర్న్!
గమనించాల్సిన విషయం ఏమిటంటే— ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా మొదట భారీగా ట్రోల్ అవుతుంది. కానీ ఆ వెంటనే అదే కంటెంట్ సోషల్ మీడియాలో పాజిటివ్ మౌత్‌టాక్‌ను సొంతం చేసుకుంటుంది. ఫస్ట్ లుక్,టైటిల్,టీజర్,సాంగ్స్..ప్రతీ అప్డేట్కు ఇదే రిపీటయ్యే ప్యాటర్న్ కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన ‘శశిరేఖ’ సాంగ్ కూడా మొదట నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చినప్పటికీ, ఇప్పుడు అదే పాట భారీ రీచ్ పొందుతూ 100 మిలియన్ల మార్క్ చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
“ఇది మెగాస్టార్ పవర్!” – సినీ ప్రముఖులు:
మెగా అభిమానులంతా ఒకే మాట చెబుతున్నారు—‘‘ఈ వ్యూస్ మెగాస్టార్ ఫ్యాన్ బేస్ పవర్’’. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ఈ నంబర్లు మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి.
సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్:
ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2026 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కుటుంబ కథా నేపథ్యం, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపి ఉంటుందని చెప్పబడుతోంది.అందువల్ల ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు పెద్ద ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటివరకు విడుదలైన ప్రచార కంటెంట్‌తోనే బాక్సాఫీస్ వద్ద అద్భుత హైప్ క్రియేట్ చేసింది. సంగీతం పనిచేయడం, మెగాస్టార్ క్రేజ్ కలిసి సినిమా కోసం భారీ ఎక్స్పెక్టేషన్స్ని క్యార్రీ చేస్తున్నాయి. ఇంకా టీజర్, ట్రైలర్ రానుండటంతో ఒక్కొ స్టెప్‌కు హైప్ మరింత రెట్టింపు అవడం ఖాయం.