ప్రభాస్ VS రజనీకాంత్: నెగ్గేది ఎవరు..? తగ్గేది ఎవరు..? ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ వార్..!

Thota Jaya Madhuri
ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యంత భారీ స్టార్ ల  గురించి మాట్లాడితే, ఆ జాబితాలో కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు టాప్ లైన్‌లో నిలిచిపోతుంది. తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన సాధించిన ప్రజాదరణ, అభిమానుల ప్రేమ, మార్కెట్ పర్ఫార్మెన్స్… ఇవన్నీ ఒక లెజెండ్‌గానే మిగిలిపోయే గొప్ప విషయాలు. రజినీకాంత్ కెరీర్ అంటే అసలు విజయాల చరిత్రే. ఎన్నో హై మూమెంట్స్ ఉన్నట్టే, కొన్ని లో మూమెంట్స్ కూడా వచ్చినా, వాటిని దాటుకొని మరింత ఉన్నత స్థానంలో నిలవడం మాత్రం రజినీకాంత్ ప్రత్యేకత.అలాంటి రజినీకాంత్ కెరీర్‌లో రెఫరెన్స్‌గా చెప్పుకునే మూవీ “పడయప్ప”. తమిళంలో విజృంభించిన ఈ క్లాసిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెలుగులో “నరసింహ” పేరుతో డబ్బింగ్ అయి వచ్చింది. రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి సూపర్‌స్టార్ కెరీర్‌కి మరో పెద్ద మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్, పంచ్ డైలాగ్స్, రోల్ డిజైన్ – ఇవన్నీ ఈ చిత్రంలో గరిష్ఠ స్థాయిలో దర్శనమిచ్చాయి.



ఈ ఐకానిక్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. అందులో భాగంగానే సూపర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్ 12న గ్రాండ్ రీ–రిలీజ్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.ఈ రీరిలీజ్ కోసం కోలీవుడ్‌లో భారీ ప్లానింగ్ జరుగుతుండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా పెద్ద స్కేల్లో రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొస్తున్నారు. ఇండియా మాత్రమే కాదు, ఆల్రెడీ యుఎస్, సింగపూర్, మలేషియా, జపాన్, మిడిల్ ఈస్ట్‌లో షెడ్యూల్స్ ప్లాన్ అవుతున్నాయి. రజినీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కల్చరల్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాయని ఇది మరోసారి నిరూపించే అవకాశం.



ఈ రీరిలీజ్‌పై ఉన్న హైప్ దృష్ట్యా బాక్సాఫీస్ ట్రేడ్ లో ఒక డిస్కషన్ బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్లు దక్షిణాదిలో కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తే, బ్లాక్‌బస్టర్లకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని. ఖచ్చితంగా “బాహుబలి: ది ఎపిక్” వంటి భారీ స్థాయి రీరిలీజ్ రికార్డులను కూడా ఛాలెంజ్ చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే నిజంగా ఆ రేంజ్‌లో అద్భుత స్పీడ్‌తో ముందుకు సాగి రికార్డులు నెలకొల్పుతుందా? లేక అభిమానుల ఉత్సాహం వరకే పరిమితమవుతుందా? అన్నది చూడాల్సిందే. కానీ అంచనాలు మాత్రం అసాధారణ స్థాయిలో ఉన్నాయి.రజినీకాంత్ సినిమాలు కథ, పంచ్, యాక్షన్ మాత్రమే కాదు. అవి అభిమానులకు ఒక సంస్కృతీ. నటుడిగా, వ్యక్తిగా, ఐకాన్‌గా, రోల్ మోడల్‌గా ఆయన స్థానమే వేరే స్థాయి. ఒక సినిమా రీరిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీ క్రేజ్ రావడం కూడా అదే కారణం. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ వర్సెస్ రజనీకాంత్ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: