ఆ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్.. సడెన్ ట్విస్ట్ ఇచ్చిన సూపర్ స్టార్!

Thota Jaya Madhuri
దక్షిణాది సినీరంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ఒకటైన ‘నరసింహ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన సమయంలో మాత్రమే కాకుండా, తర్వాత వచ్చిన ఏళ్లలో కూడా ప్రేక్షకుల ప్రేమను కోల్పోకుండా, క్లాసిక్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. రజినీకాంత్ సరికొత్త మాస్ షేడ్స్, రవికుమార్ డైరెక్షన్, డివైన్ ఎలిమెంట్స్ కలిసినప్పుడు ఏ స్థాయి సెన్సేషన్‌ రూపొందుతుందో ఈ సినిమా నిరూపించింది. ఇలాంటి అద్భుతమైన మూవీ మళ్లీ ఒకసారి పెద్ద స్క్రీన్‌పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిన తర్వాత ఫ్యాన్స్‌లో ఆనందానికి హద్దుల్లేవు. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా తమిళ్ వెర్షన్‌ను ప్రత్యేక రీ–రిలీజ్‌గా ప్రకటించిన మేకర్స్, చాలా పెద్ద స్కేల్‌లో విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



ఈ రీ–రిలీజ్ కోసం మేకర్స్ ఒక అరగంటకు పైగా నిడివి కలిగిన స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఇందులో సినిమా షూటింగ్ లోని అరుదైన క్షణాలు, గుర్తుండిపోయే సన్నివేశాల వెనుక కథలు, అప్పటి టీమ్ మెమొరీస్ ఇలా అనేక ఆసక్తికర విషయాలు అన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో రజినీకాంత్ స్వయంగా చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అభిమానుల్లో భారీ చర్చకు దారితీయడం విశేషం.ఈ వీడియోలో రజినీకాంత్ స్వయంగా తెలిపిన మాటల ప్రకారం, నరసింహకు సీక్వెల్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఆ సీక్వెల్‌కు “నీలాంబరి” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలిపారు.



ఇది విని ఫ్యాన్స్ లో ఉత్సాహం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎందుకంటే మొదటి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన “నీలాంబరి” పాత్ర ఎంత శక్తివంతమైందో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ పాత్ర మీదే పూర్తిగా ఆధారపడి సీక్వెల్ వస్తున్నట్టు రజినీకాంత్ చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఇదే. మరోసారి రమ్యకృష్ణ తనదైన ఠీవి, వేల్యనిజం, స్టైల్‌తో మెస్మరైజ్ చేయనున్నారా? లేకపోతే కథ పూర్తిగా కొత్త పద్ధతిలో, మరింత మోడ్రన్ టచ్ తో రూపొందబోతోందా? నీలాంబరి పాత్రను పూర్తిగా డిఫరెంట్ ఆంగిల్ లో చూపించబోతున్నారా? అనే విషయాలపై భారీ కుతూహలం నెలకొంది.ఇప్పటికే సీక్వెల్ కథపై డిస్కషన్స్ జరుగుతున్నాయి అని టీమ్ వెల్లడించడం వల్ల, ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగే అవకాశం ఉందనే చెప్పాలి.



మొదటి సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ రీ–రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రజినీకాంత్ అభిమానులు ఈ తేదీని మహోత్సవంలా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు.ఓవర్ ఆల్..నరసింహ రీ–రిలీజ్..అరగంట స్పెషల్ వీడియో..రజినీకాంత్ స్వయంగా సీక్వెల్ కన్ఫర్మ్..“పడయప్ప 2” టైటిల్ .. “నీలాంబరి”..రమ్యకృష్ణ పాత్ర మరోసారి హైలైట్..అన్నీ కలిపి ప్రస్తుతం కోలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఆడియన్స్ లో ‘నరసింహ–నీలాంబరి’ పై హైప్ ట్రెమండస్ గా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: