ఈ వారం థియేటర్లలో 16 సినిమాలు.. అఖండ2 దెబ్బకు లెక్కలు మారాయిగా!

Reddy P Rajasekhar

గత వారం థియేటర్లలో విడుదల కావాల్సిన అఖండ 2 సినిమా రిలీజ్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన లేదా 25వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈరోజు, ఈ సినిమా విడుదల తేదీ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అఖండ 2 వంటి భారీ చిత్రానికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో, దాని విడుదల తేదీ ఖరారైతే మిగిలిన చిత్రాల ప్రదర్శనపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే నిర్మాతలు ఈవారం విడుదలకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.

అయితే, ఈ వారం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ శుక్రవారం థియేటర్లలో ఏకంగా 16 చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకే రోజు 16 చిన్న సినిమాలు విడుదల కావడం అంటే సాధారణ విషయం అయితే కాదని చెప్పవచ్చు. ఇలాంటి భారీ విడుదల, థియేటర్ల లభ్యత విషయంలో చిన్న సినిమాలకు నిజమైన సవాలుగా నిలవనుంది.

పెద్ద సినిమాగా భావిస్తున్న అఖండ 2 విడుదల తేదీలో జాప్యం కారణంగానే చిన్న సినిమాల లెక్కలు మారాయని, ఇదంతా అఖండ 2 సినిమా దెబ్బేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆయా సినిమాల నిర్మాతలు, పంపిణీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం వల్ల, తమ చిత్రాలకు మెరుగైన థియేటర్లను దక్కించుకోవచ్చని, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చని చిన్న సినిమా మేకర్స్ ఆశిస్తున్నారు.

ఈ శుక్రవారం విడుదల కానున్న చిన్న సినిమాల జాబితాలో సైకో సిద్దార్థ, ఇషా, మోగ్లీ, అన్నగారు వస్తారు, సహా కుటుంబానాం వంటి చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు, పైసావాలా, వన్ బై ఫోర్, డ్రైవ్ కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాలని సినీ అభిమానులు, చిన్న సినిమా ప్రియులు కోరుకుంటున్నారు. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టయినా, మిగిలిన చిన్న సినిమా నిర్మాతలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: