‘వారణాసి’ తర్వాత రాజమౌళి చేయబోతున్న ప్రాజెక్ట్ ఇదే..హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!?
వైరల్ అవుతున్న ప్రకారం ఆ సినిమా సాధారణ ప్రాజెక్ట్ కాదు… భారత మహాకావ్యం ‘మహాభారతం’ ఆధారంగా ఉండే భారీ విజువల్ ఎపిక్ అని వినిపిస్తోంది. దీనితో రాజమౌళి జీవితంలోనే పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనని చెప్పడానికి సందేహం లేదు. “మహాభారతం” తీయడం తన లైఫ్ డ్రీమ్ అని రాజమౌళి చాలా సార్లు పబ్లిక్‌గా చెప్పిన విషయమే.
మహాభారతాన్ని ఒక్క సినిమా రూపంలో చెప్పడం అసాధ్యం కాబట్టి, దీన్ని 10 భాగాలుగా రూపొందించాలని రాజమౌళి ముందే వెల్లడించారు. ఆ లెవెల్లో కథ, క్యారెక్టర్స్, విజువల్ లెవెల్, సెటప్స్ అన్నీ ప్లాన్ చేసుకోవడానికి కనీసం 15 ఏళ్ల టైమ్ పడుతుందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.అంటే ఇప్పుడే ప్రారంభించినా మహాభారతం మొత్తం పూర్తవ్వాలి అంటే మినిమమ్ మరో దశాబ్దం పైనే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఋఋఋ-2 కూడా వచ్చే అవకాశం ఉందని రాజమౌళి కొద్ది రోజులుగా సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అంటే వారణాసి → ఋఋఋ-2 → మహాభారతం అనే ప్లాన్ కూడా ఉండొచ్చనే టాక్ బలంగా ఉంది.ఇప్పుడు ఇవన్నీ కలిపి చూస్తే ఇంకా ఈ ప్రాజెక్ట్‌లు ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో చెప్పలేని పరిస్థితి. కానీ రాజమౌళి ఏ పని చేయాలన్నా అందులో భారీ స్కేలు, అద్భుత విజువల్స్, ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండటం ఖాయం.
మహాభారతం స్టేజ్‌కి వచ్చేసరికి… ఏ స్టార్ హీరో ఏ రోల్ చేస్తాడు అనే విషయం పై టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పెద్ద డిబేట్ మొదలవడం ఖాయం. ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అందరి పాన్ ఇండియా హీరోలని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఆ అధికారిక వివరాలు బయటకు రావాల్సి ఉంది.ఎవరైనా హీరో అయినా రాజమౌళి సినిమానే అన్న మాటకే ఫ్యాన్స్ ఫస్టు షో, హిట్టు గ్యారెంటీ అన్నట్టే..!