"నువ్వే బాలయ్య పాలిట శనిలా దాపురించావ్"..నందమూరి ఫ్యాన్స్ ఘాటు కామెంట్స్..!

Thota Jaya Madhuri
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని చూడటానికి బాలయ్య అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుండగా, అకస్మికంగా వచ్చిన వాయిదా వార్తతో అభిమానుల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం వెల్లువెత్తింది. ఇన్ సైడ్ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన ఫైనాన్స్ సమస్యలు చాలా రోజులుగా కొనసాగుతున్నప్పటికీ, ఈ విషయాన్ని బాలకృష్ణకు స్వయంగా చెప్పకుండానే నిర్మాతలు దాచిపెట్టారన్నది పరిశ్రమలో వినిపిస్తున్న మాట. చివరకు ఫైనాన్షియర్లు పేమెంట్లు క్లియర్ చేయలేదని చెప్పి కఠినంగా అడ్డుకోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అభిమానులను మరింత కోపానికి గురిచేస్తోంది.



ఇటీవల జ్యోతిష్యుడు వేణు స్వామి ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఆయన సమంత రెండో పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ అంశంపై మాట్లాడదల్చుకోలేదని తెలిపారు. అలాగే, ఇటీవల టాలీవుడ్‌లో విడుదలకానున్న ఒక పెద్ద స్టార్ హీరో సినిమా కోసం ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నానని వెల్లడించారు. అయితే హీరో పేరును మాత్రం చెప్పలేదు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో చాలా మంది నందమూరి అభిమానులు, ఆ పూజలు ‘అఖండ 2’ విడుదల కోసం చేసినవేనని నమ్మారు. కానీ సినిమా వాయిదా పడిన తరువాత, అదే అభిమానులు వేణు స్వామిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.చిత్రం వాయిదా వెలుగులోకొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు తమ కోపాన్ని వ్యక్తపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వేణు స్వామిని నేరుగా ట్యాగ్ చేస్తూ..“దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ వీడు!”..“ఈడితో మొదలైంది సగం దరిద్రం!”...“పూజలు, హోమాలు చేస్తే సినిమాలు రిలీజ్ అవుతాయనుకోవడం ఏంటి?… నిర్మాతలు డబ్బులు క్లియర్ చేస్తేనే రిలీజ్ అవుతుంది రా!”..“అన్నయ్య సినిమా గాడిలో పడే సమయంలో శనిలా దాపురించావ్!”అంటూ ఆగ్రహంగా కామెంట్లు చేస్తున్నారు. నిర్మాతలపై కూడా ఆగ్రహం పెరుగుతోంది.ప్రేక్షకులు, అభిమానులు మాత్రమే కాదు, సినీ వర్గాల్లో కూడా నిర్మాతల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద చిత్రాన్ని చివరి నిమిషంలో వాయిదా వేయడం, ఫైనాన్షియల్ ఇష్యూలను వెంటనే క్లియర్ చేయకపోవడం, టీమ్‌లో సకాలంలో కమ్యూనికేషన్ లేకపోవడం బాలయ్య ఇమేజ్‌కే నష్టం కలిగించిందని పలువురు విమర్శిస్తున్నారు.  ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: