వారణాసి గ్లింప్స్‌లో రాజమౌళి చేసిన క్లాసీ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే.. ఏం బుర్ర సామీ నీది..!

Thota Jaya Madhuri
రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమా "వారణాసి". ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా అదే విధంగా విలన్ గా పృధ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, కార్తికేయ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘వారణాసి’, మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు—భారతీయ సినీ పరిశ్రమలో కొత్త ప్రమాణాలను సృష్టించే చిత్రంగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.ఈ వారణాసి గ్లింప్స్ విడుదల  తరువాత రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వారణాసి విషయంలో రాజమౌళి ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు షూట్ చేసిన ఒక్క ఫ్రేమ్ కూడా చూపించలేదు. వారణాసి గ్లింప్స్ చూస్తే ఆ విషయం బాగా అర్ధం అవుతుంది. ఒకవేళ ఇంకొక దర్శకుడు అయితే షూట్ చేసిన ఫుటేజ్‌ను చూపించి హైప్ పెంచే ప్రయత్నం చేసేవాడు. కానీ రాజమౌళి చూపించింది మాత్రం—

సినిమా సౌండ్ ఎంత శక్తివంతంగా ఉండబోతోందో..? సినిమా స్కేల్ ఎంత పెద్దదో..? టోన్, ఎమోషన్ ఎలా ఉండబోతోందో..? ప్రేక్షకుడు ఏ వైబ్ కోసం సిద్ధం కావాలో..? ముందుగానే గ్లింప్స్ రూపంలో హింట్ ఇచ్చాడు.

ఇలా చేసి ఆయన ఏమి సాధించాడు?

*అభిమానుల్లో నెలల తరబడి ఉన్న కరువు తీర్చాడు
*మరో ఆరు నెలలు ఎలాంటి అప్‌డేట్ అడగకుండా కూల్ అయ్యేలా చేశాడు
*ఒకే ఈవెంట్‌తో వాతావరణాన్ని పూర్తి‌గా తన వైపు తిప్పుకున్నాడు
*తెలుగు నుంచి గ్లోబల్ యూనిట్‌ వరకు అందరి దృష్టిని ఆకర్షించాడు

మొత్తం మీద—రాజమౌళి అంటే మాస్టర్‌మైండ్ అని మరోసారి ప్రూవ్ చేశాడు.

తన సినిమా ప్రమోషన్స్‌లో, హైప్ క్రియేట్ చేయడంలో, ప్రేక్షకుల మనసు అర్థం చేసుకోవడంలో, మార్కెటింగ్‌ని ఉపయోగించుకోవడంలో రాజమౌళికి సాటిలేరు. అందుకే ఆయనను “మార్కెటింగ్ మాస్టర్‌మైండ్” అంటారు. ఎవరి తలలో పడని స్ట్రాటజీలు ఆయన ఒక సింపుల్ ఈవెంట్‌లోనే అమలు చేస్తాడు. అందుకే ప్రతి స్టెప్ రాజమౌళిది—ప్లాన్ చేసి, పర్ఫెక్ట్‌గా వదిలే మాస్ట‌ర్ మూవ్. మొత్తానికి రాజమౌళి-మహేశ్ బాబుతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ కాంబో ఎంత వరకు సెట్ అవుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: