ఆ పాటకి అమలతో డ్యాన్స్ చేసిన నాగార్జున..చూడటానికి రెండు కళ్ళు చాలవు అంతే..!
ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత, ఆ అద్భుతమైన లెజెండరీ క్లాసిక్ సినిమా మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వేడుకల సందర్భంగా, నవంబర్ 14న ‘శివ’ రీ-రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని, నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ స్టేజ్ పై ఒక ప్రత్యేక ఎపిసోడ్‌ను తెరకెక్కించారు. ఆ ఎపిసోడ్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే రీల్ & రియల్ లైఫ్ హీరోయిన్ అమల ఇద్దరూ ప్రత్యేకంగా పాల్గొన్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున, “బోటనీ పాఠం ఉంది, మ్యాట్నీ ఆట ఉంది… దేనికో ఓటు చెప్పరా?” అంటూ ‘శివ’ సినిమా పాపులర్ సాంగ్ బ్యాక్‌డ్రాప్‌లో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు.
తర్వాత అమల రంగంలోకి దిగుతూ, నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఉత్సాహపరిచింది. వీరి జంటను చూడటానికి అభిమానులు, కంటెస్టెంట్లు అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా జంటలుగా ఏర్పడి ఆ పాటకు స్టెప్పులు వేసి వేదికను కదిలించారు.ఈ సందర్భంగా అమల ఫుల్ ఎంజాయ్ చేస్తూ, నాగార్జునను ప్రేమగా చూస్తూ డ్యాన్స్ చేయడం ఆడియన్స్‌కి పాత జ్ఞాపకాలను తిప్పి తెచ్చింది. ఆ ప్రోమోలో నాగార్జున సరదాగా “నిన్ను బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు ఉంచితే ఉంటావా?” అని ఆర్జీవీని అడిగాడు. దానికి రామ్ గోపాల్ వర్మ తడబాటు లేకుండా, తన స్టైల్‌లోనే “అందరూ సుందరమైన సంజనా లాంటి అమ్మాయిలు ఉంటే, కచ్చితంగా ఉంటాను ” అంటూ సమాధానమిచ్చాడు. ఈ ఎపిసోడ్ బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, తెలుగు సినిమా అభిమానులందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ ఇవ్వబోతోంది.