"కుంభ" విషయంలో అచ్చం బాహుబలి ఫార్ములానే ఫాలో అవుతున్న జక్కన్న..! మీరు గమనించారా..!

Thota Jaya Madhuri
తెలుగు సినీ పరిశ్రమలో ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రాకుండానే దాదాపు ఒక సంవత్సరంపాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, ఫ్యాన్స్‌లో అతి పెద్ద స్థాయి ఆసక్తి రేపిన సినిమా ఏదైనా ఉంటే — అది నిస్సందేహంగా మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్‌పై మొదటి న్యూస్ బయటకు వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు  ప్రతిరోజూ ఏదో ఒక హైప్ సోషల్ మీడియాలో క్రియేట్ అవుతూనే ఉంది. మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడన్న ఒక్క మాటతోనే ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దాంతో పాటు, రాజమౌళి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ అందరికీ తెలిసిందే — ఆయన ప్రతి సినిమా మీద వర్క్ చేయడంలో చూపించే ప్యాషన్, పర్‌ఫెక్షన్ వేరు లెవల్‌లో ఉంటుంది.



ఈసారి కూడా అదే ఫార్ములానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం లుక్స్ డిజైన్ చేయడానికి కూడా రాజమౌళి దాదాపు సంవత్సరం పాటు టైం తీసుకున్నారని, ఆ లుక్స్ కోసం మహేష్ బాబుని కూడా బాగా వర్క్ చేయించారని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ కృషికి ఫలితంగా, రీసెంట్‌గా బయటకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ తో సోషల్ మీడియా ఒక్కసారిగా హిట్ అయిపోయింది. స్వయాన రాజమౌళే ..పృథ్వీరాజ్ సుకుమార్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఆయన పాత్ర పేరు “కుంభ” అని వెల్లడించారు. ఆ ఒక్క లుక్ చాలు — సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. వీల్ చైర్‌లో కూర్చుని ఉన్నా కూడా, ఆ పవర్, ఆ ఆత్మవిశ్వాసం, ఆ విలన్ లుక్‌లోని గంభీరత చూసి అందరూ షాక్ అయ్యారు.



సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురుస్తోంది —"ఇంత స్టైలిష్ విలన్ తెలుగు సినిమాల్లో ఎప్పుడూ రాలేదు!".."వీల్ చైర్‌లో ఉన్నా పవర్ లెవల్ తగ్గలేదు!" అంటూ నెటిజన్లు ఫీడ్ అవుతున్నారు. ఇక చాలామంది సినిమాప్రేమికులు, సినిమా విశ్లేషకులు మాత్రం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు — “ఇది బాహుబలి ఫార్ములానే కదా..! రానా దగ్గుబాటి క్యారెక్టర్‌ని హ్యాండ్సమ్‌గా, పవర్‌ఫుల్‌గా, హీరోకి సమానంగా చూపించినట్టే, ఇప్పుడు పృథ్వీరాజ్ పాత్రను కూడా అదే విధంగా డిజైన్ చేశారు” అని అంటున్నారు. అసలు, రాజమౌళి సినిమాల్లో విలన్ కూడా హీరో లెవల్‌లోనే ఉంటాడు — స్ట్రాంగ్ ప్రెజెన్స్, హై ఇంపాక్ట్, డీప్ ఎమోషన్. బాహుబలిలో రానా దగ్గుబాటి ఎంత హ్యాండ్సమ్‌గా, ఎంత ఎలివేషన్‌తో కనిపించాడో, ఇప్పుడు అదే ఎనర్జీని పృథ్వీరాజ్ సుకుమార్ మీద కూడా తీసుకురాబోతున్నాడట జక్కన్న. “వీల్ చైర్‌లో కూర్చున్నా కూడా, ఆ కళ్లలోని అహంకారం, ఆ సైలెంట్ అగ్రెషన్ — అదొక సీన్‌లోనే సినిమా లెవల్ పెంచేస్తుంది” అని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: