చరణ్ కంటే ముందే ఆ హీరోని డైరెక్ట్ చేయబోతున్న సుక్కు..ఇది రా రివేంజ్ అంటే..!

Thota Jaya Madhuri
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న హాట్ టాపిక్ ఇదే .  డైరెక్టర్ సుకుమార్ యొక్క నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అందరి తెలుసు. పుష్ప 2 తారువాత ఆయన రేంజ్ బాగా మారిపోయింది. ఇప్పుడు  రామ్ చరణ్‌తో సుకుమార్ ఒక సినిమాకు కమిట్ అయ్యారని ఇప్పటికే అందరికీ తెలుసు. ఈ సినిమా “రంగస్థలం 2” గా తెరకెక్కనుందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.



సుకుమార్–చరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అది నిజమే. అది వేరే కధ అంటున్నారు కొంతమంది జనాలు. వీళ్ళ కాంబో మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతుందనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో కనిపిస్తున్నప్పటికీ, ఆ సినిమా ఏ కాన్సెప్ట్‌లో వస్తుంది? ఏ జానర్‌లో తెరకెక్కనుంది? అనే విషయాలు మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉన్నాయి.ఇంతలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్‌తో సినిమా మొదలయ్యేలోపే, సుకుమార్ మరొక స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. ఆ హీరో మరెవరో కాదు — విజయ్ దేవరకొండ!


టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ స్టార్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, సుకుమార్ త్వరలోనే ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్‌ కోసం ప్రత్యేక అడ్వర్టైజ్‌మెంట్‌ను డైరెక్ట్ చేయబోతున్నారట. ఆ బ్రాండ్‌కు ఫేస్‌గా, అంటే ప్రమోట్ చేయబోయే వ్యక్తిగా విజయ్ దేవరకొండను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ అడ్వర్టైజ్‌మెంట్ షూట్ ఇప్పటికే ప్లాన్‌లో ఉందని, త్వరలోనే ఆ క్లిప్స్ సోషల్ మీడియాలో విడుదల కానున్నాయని సమాచారం. దీంతో రామ్ చరణ్‌తో సుకుమార్ సినిమా కంటే ముందే, విజయ్ దేవరకొండను సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.ఇక సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు సరదాగా, “చరణ్ ఎక్కువ టైమ్ సుకుమార్‌ని వెయిట్ చేయించడంతో, ఆయన రివెంజ్‌గా ముందుగా విజయ్ దేవరకొండతో పని చేస్తున్నాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తం మీద సుకుమార్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పేర్లు ఒకేసారి ట్రెండ్ అవుతుండటంతో, ఈ న్యూస్ టాలీవుడ్‌లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద హడావుడిగా మారింది. రాబోయే రోజుల్లో సుకుమార్–చరణ్ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందా? లేక నిజంగానే విజయ్ దేవరకొండతో అడ్వర్టైజ్‌మెంట్ ప్రాజెక్ట్ ముందుగా వస్తుందా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: