అట్లీ కి అంత సీన్ ఉందంటారా..? బన్నీ ని బకరా చేసేస్తున్నాడా..?

Thota Jaya Madhuri
ఇటీవల సోషల్ మీడియాలో అల్లు అర్జున్–అట్లీ సినిమాపై తెగ చర్చ జరుగుతోంది. “అట్లీకి అంత సీన్ ఉందంటారా..? బన్నీని బకరా చేసేస్తున్నాడా..?” అంటూ కొన్ని పోస్టులు, మీమ్స్, ట్రోల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసే జనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పై హేట్ ట్రెండ్ ఒకింత ఎక్కువయ్యిందనే చెప్పాలి.మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న సోషల్ మీడియా వార్ ఇప్పుడు మరింత హీట్ పికప్ చేసుకుంది. కొంతమంది “మెగా వెర్సెస్ ఐకాన్ స్టార్ వార్ మళ్లీ మొదలైంది” అంటుంటే, మరికొంతమంది “మెగా ఫ్యామిలీ మధ్య మళ్లీ బంధం కుదిరింది” అంటూ వాదిస్తున్నారు. ఏదేమైనా, సోషల్ మీడియాలో రెండు ఫ్యాన్ బేస్‌లు కూడా తమ తమ హీరోల కోసం పదునైన మాటల యుద్ధం సాగిస్తున్నారు.



ఇక మరోవైపు, రామ్ చరణ్ తాజా సినిమా పెద్ది నుంచి రిలీజ్ అయిన “చికిరి చికిరి” పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆ సాంగ్‌లో రామ్ చరణ్ వేసిన డాన్స్ స్టెప్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్, బీట్, ఎనర్జీ అన్నీ కలిపి ఆ సాంగ్ పక్కా బ్లాక్‌బస్టర్ అయింది. ఈ పాట చూసిన సినీప్రియులు మాత్రమే కాకుండా, చాలా మంది స్టార్‌లు కూడా చరణ్ స్టెప్స్‌కి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే, ఈ సాంగ్ సక్సెస్‌తో పాటు మరో చర్చ కూడా మొదలైంది. ఇప్పటివరకు “డ్యాన్స్ అంటే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్” అని ఫిక్స్‌డ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లు కూడా ఇప్పుడు “చరణ్ స్టెప్స్ వీళ్లిద్దరిని మించి ఉన్నాయి” అని కామెంట్లు చేస్తున్నారు. ఈ మాటలు బన్నీ అభిమానులకి మాత్రం నచ్చట్లేదు. దాంతో సోషల్ మీడియాలో కొత్త యుద్ధరంగం మొదలైంది.



కొంతమంది యూజర్లు అయితే నేరుగా బన్నీని టార్గెట్ చేస్తూ “అట్లీ సినిమా లో బన్నీని బకరా చేస్తాడా..?, అట్లీకి అంత సీన్ ఉందా..?, అట్లీ బన్నీని ఆ రేంజ్ లా చూపిస్తాడా..?” అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వివాదాలన్నీ, కామెంట్లన్నీ చూస్తుంటే సోషల్ మీడియా పూర్తిగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ యుద్ధభూమిగా మారిపోయింది. ఒక వైపు చరణ్ అభిమానులు “చికిరి చికిరి"” సాంగ్ స్టెప్స్‌తో జోష్‌లో ఉన్నారు, మరోవైపు బన్నీ అభిమానులు “అట్లీ మూవీతో గేమ్ రివర్స్ అవుతుంది” అని కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల మధ్య డాన్స్, మార్కెట్, ఇమేజ్, డైరెక్టర్ కాంబినేషన్ అన్నీ కలిపి ఒక హాట్ టాపిక్‌గా మారిపోయాయి. అట్లీ–బన్నీ కాంబినేషన్ మూవీ ఇంకా మొదలు కాకముందే ఇంత హైప్, ఇంత వివాదం వస్తే — రిలీజ్ టైమ్‌కి ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో ఊహించుకోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: