రామ్ చరణ్ తన కెరీయర్ లోనే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇదే..!
ఇలాంటి సక్సెస్ టైమ్‌లోనే రామ్ చరణ్ గురించి మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. “రామ్ చరణ్ తన కెరీర్‌లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన సినిమా ఏదంటే..?” అని నెట్‌లో చర్చ నడుస్తోంది. ఆ సినిమా మరెవ్వదో కాదు — “ఆరెంజ్”! ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత ట్రెండీ సినిమాగా నిలిచింది. అప్పట్లో యూత్ లవర్స్‌కు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది. కానీ విడుదల తర్వాత ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా ముద్రపడినా, సినిమాకు ఉన్న మ్యూజిక్, స్టైలిష్ ప్రెజెంటేషన్, చరణ్ లుక్ మాత్రం యూత్‌కి బాగా నచ్చాయి.
ఈ సినిమాకు ప్రొడ్యూసర్ మరెవ్వరో కాదు, రామ్ చరణ్ బాబాయ్ — నటుడు, నిర్మాత నాగబాబు. కుటుంబ సభ్యుడిగా ఆయన నిర్మిస్తున్న సినిమా కావడంతో రామ్ చరణ్ ఎటువంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. “సినిమా హిట్ అయిన తర్వాత చూద్దాం, ఇప్పుడే ఏమీ వద్దు” అని సరదాగా చెప్పారని అంటారు. కానీ నాగ బాబు ఆ టైంలో కొంత దబ్బులు ఇచ్చారట. దురదృష్టవశాత్తు “ఆరెంజ్” సినిమా ఆ సమయంలో ఆర్థికంగా విఫలమైంది.
ఆ సినిమా ఫెయిల్యూర్ కారణంగా నాగబాబు ఆర్థిక సమస్యల్లో పడిపోయారు. అప్పుడు రామ్ చరణ్ తీసుకున్న డబ్బులు కూడా ఇచ్చేశాడట. “ఇది ఫ్యామిలీ సినిమా, మన సినిమా” అని చెబుతూ నాగబాబుకి పూర్తి సపోర్ట్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. ఇదే ఆయన ఎంత బాధ్యతాయుతంగా, ఎంత మనసుతో వ్యవహరించారో చూపిస్తుంది. అందుకే చరణ్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు ఫ్యాన్స్..!!