ఆల్ టైం రికార్డు కొట్టిన "చిక్రి చిక్రి".. 24 గంటల్లో వచ్చిన వ్యూస్.. లైక్స్ తెలిస్తే షాక్ కావాల్సిందే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అయినటువంటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఉప్పెన సినిమాతో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో శివరాజ్ కుమార్ , జగపతి బాబు ,  దివ్యాందు కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు.


ఈ సినిమాను వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కొంత కాలం క్రితం ఈ మూవీ నుండి ఫస్ట్ షాట్ అనే పేరుతో ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి చిక్రి చిక్రి అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు. ఈ మూవీ లోని మొదటి పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. 


ఈ మూవీ లోని చిక్రి చిక్రి అంటూ సాగే మొదటి పాటకు విడుదల అయిన 24 గంటల్లో 29.19 మిలియన్ వ్యూస్ ... 676.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా లోని మొదటి సాంగ్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ 24 గంటల్లో లభించింది. ఇకపోతే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సాంగ్స్ లో ఈ పాట మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. అలాగే 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను అందుకున్న తెలుగు సాంగ్స్ లలో ఈ సాంగ్ నాలుగువ స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: